నీరవ్ మోదీ సోదరుడు నేహాల్ మోదీ అమెరికాలో అరెస్ట్.. త్వరలో భారత్ కు..?
పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరుడు నేహల్ దీపక్ మోదీ అరెస్ట్ అయ్యాడు. అమెరికాలో అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విజ్ఞప్తి మేరకు ఇంటర్ పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా నేహల్ మోదీని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీకి బిగ్ షాక్ తగిలింది. అతని తమ్ముడు నేహల్ దీపక్ మోదీని అమెరికాలో పోలీసులు అరెస్ట్ చేశారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విజ్ఞప్తి మేరకు ఇంటర్ పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసుల ఆధారంగా నేహల్ మోదీని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
భారత్ లో జరిగిన అతిపెద్ద బ్యాంకింగ్ స్కాంలో ఒకటిగా PNB స్కామ్ ఉంది. ఈ కేసులో నేహాల్ మోదీ కీలక నిందితుడిగా ఉన్నాడు. బెల్జియం పౌరుడైన నేహల్ మోదీ అరెస్టుతో ఈ కుంభకోణం కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకున్నట్లు భావించవచ్చు. నేహల్ మోదీని భారత్ కు అప్పగించాలని భారత్ లోని సీబీఐ, ఈడీ సంస్థలు చేసిన అభ్యర్థన మేరకు నేహల్ మోదీని అరెస్టు చేసినట్లు అమెరికాలోని అధికారులు తెలిపారు.
దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణాల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) స్కామ్ ఒకటి. ఇందులో నీరవ్ మోదీతో పాటు నేహల్ మోదీ ప్రధాన నిందితులుగా ఉన్నారు. నీరవ్ మోదీ PNB నుంచి రుణం తీసుకుని.. అక్రమ నగదు చలామాణి చేశాడు. షెల్ కంపెనీలను సృష్టించి, విదేశీ ఆర్థిక మార్గాల ద్వారా పెద్ద మొత్తంలో అక్రమ నగదు చలామణికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో నీరవ్ మోదీ ఆస్తుల్ని ఈడీ స్వాధీనం చేసుకుంది.

భారత్ నుంచి యూకే పారిపోయిన నీరవ్ మోదీని.. భారత్ విజ్ఞప్తి మేరకు 2019లో అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. అయితే అతన్ని భారత్ కు అప్పగించేందుకు ఈ ఏడాది బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరోవైపు నేహల్ మోదీని భారత్ కు అప్పగించే విషయంపై తదుపరి విచారణ 2025 జులై 17న జరగనుంది.












Click it and Unblock the Notifications