వాలెంటైన్స్ డే: భారత్ నుంచి లక్ష గులాబీలను దిగుమతి చేసుకున్న నేపాల్
ఖాట్మాండ్: ప్రేమ, ప్రేమికులు అనగానే అందుకు చిహ్నమైన గులాబీ పువ్వులే గుర్తుకొస్తాయి. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు పురస్కరించుకుని నేపాల్.. భారతదేశం నుంచి రూ. 40లక్షల విలువైన లక్ష గులాబీలను దిగుమతి చేసుకుంది. ఈ మేరకు వివరాలను ఫ్లోరీకల్చర్ అసోసియేషన్ తెలిపింది.
‘ఏ యేడాది మేము రూ. 4మిలియన్ల విలువ చేసే గులాబీలను వాలెంటైన్స్ డే కోసం భారత్ నుంచి దిగుమతి చేసుకున్నాం' అని అసోసియేషన్ ఛైర్మన్ లోకనాథ్ గెయిర్ తెలిపారు. కాగా, నిరుడు లక్షా 50వేల గులాబీలను నేపాలీ మార్కెట్ కొనుగోలు చేసింది. అందులో 95శాతం గులాబీలను ఖాట్మాండులోని ప్రజలే కొన్నారట.

ఈసారి భారత్‌లో గులాబీల ధర పెరగడంతో నేపాలీ కొనుగోలుదారులు తక్కువగా దిగుమతి చేసుకున్నారు. నిరుడు ఒక గులాబీ రూ. 70 ఉందని, అది ఈ యేడాది గులాబీకి రూ. 10 ఎక్కువగా వెచ్చించాల్సి వచ్చిందని లోకనాథ్ తెలిపారు.
నేపాల్లో పూలకు మంచి గిరాకీ ఉన్నప్పటికీ.. డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి కావడం లేదని తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ఖాట్మాండుతోపాటు ఇతర నగరాల్లో వాలెంటైన్స్ డేను సొమ్ము చేసుకునేందుకు గిఫ్ట్ షాపులు ఆకర్షణీయమైన ప్యాకేజీలను అందిస్తున్నాయి.












Click it and Unblock the Notifications