అందమైన అత్త మీద కన్ను: కోరిక తీర్చలేదని హత్య
న్యూఢిల్లీ: కామంతో కళ్లుమూసుకుని పోయిన యువకుడు సొంత మేనత్త (38) మీద కన్ను వేసి లైంగిక దాడికిపాల్పడ్డాడు. ఆమె ఎదురు తిరగడంతో చంపేసి నాటకాలు ఆడాడు. అత్త ఎలా చనిపోయింది అని తనకు తెలియదని నాటకాలు ఆడి చివరికి అరెస్టు అయ్యాడు.
ఉత్తర ఢిల్లీ డీసీపీ సంజయ్ సింగ్ కథనం మేరకు బీహార్ కు చెందిన చింటు (19) అనే యువకుడి మేనత్త (38), ఆమె భర్త ఢిల్లీ చేరుకుని అమన్ విహార్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. కొంత కాలం క్రితం చింటు బీహార్ నుండి ఢిల్లీ వెళ్లి అత్తమామల దగ్గర ఉంటున్నాడు.
అందంగా ఉన్న అత్త మీద చింటు కన్నుపడింది. ఉదయం మామ ఆఫీసుకు వెళ్లినప్పటి నుంచి అత్తను ఎదో ఒక విధంగా లైంగికంగా వేధించేవాడు. చిన్నపిల్లాడు తెలియక చేస్తున్నాడని ఆమె సర్దుకునింది.
గత బుధవారం ఉదయం చింటు మామ కార్యాలయానికి వెళ్లాడు. తరువాత ఆమె స్నానం చేసి బెడ్ రూంలోకి వెళ్లింది. అంతే సమయం కోసం వేచిచూస్తున్న చింటు ఒక్క సారిగా అత్త మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు.

ఆమె ప్రతిఘటించి ఎదురుతిరిగింది. ఈ విషయం మీ మామకు చెబుతునాని, కేకలు వేసి చుట్టు పక్కలవారిని పిలుస్తానని ఆమె బెదిరించింది. వెనక్కి తగ్గిన చింటు మామకు చెబితే తన పని అంతే అని భయపడ్డాడు.
అత్త గొంతునులిమి హత్య చెయ్యడానికి ప్రయత్నించాడు. తీవ్రఅస్వస్థతకు గురైన ఆమె కిందపడిపోయింది. చింటు మామకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న అతను ఆమెను సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు చెప్పారు. గొంతునులిమి హత్య చేశారని పోస్టుమార్టుం నివేదికలో వెలుగు చూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. చింటును విచారించగా అతను కట్టుకథలు చెప్పడం మొదలుపెట్టాడు. పోలీసులకు అనుమానం వచ్చి చింటును అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తమదైన శైలిలో విచారించగా తన కోరిక తీర్చడానికి నిరాకరించిన అత్తను తానే హత్య చేశానని అంగీకరించాడని డీసీపీ సంజయ్ సింగ్ చెప్పారు. చింటు మీద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామని డీసీపీ సంజయ్ సింగ్ తెలిపారు.












Click it and Unblock the Notifications