వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అడిగారు గానీ సీటు మారాలనుకోలేదు: అద్వానీ

By Pratap
|
Google Oneindia TeluguNews

 Never thought of shifting from Gandhinagar seat, Advani says
అహ్మబాదాద్: తాను లోకసభకు పోటీ చేసే సీటుపై వివాదం చోటు చేసుకుందనే వార్తలను బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ ఖండించారు. తన సంప్రదాయబద్దమైన గాంధీనగర్ సీటు నుంచి తాను మారాలని అనుకోలేదని ఆయన అన్నారు. గుజరాత్‌తో తనకు గల అనుబంధాన్ని ఆయన నెమరు వేసుకున్నారు. గాంధీనగర్ లోకసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.

భోపాల్ నుంచి కూడా పోటీ చేయాలని మధ్యప్రదేశ్‌కు చెందిన తన మిత్రులు అడిగారని, అయితే తాను గాంధీనగర్ నుంచి పోటీ చేయకూడదని ఏనాడూ అనుకోలేదని ఆయన అన్నారు. గాంధీనగర్ నుంచి కాకుండా భోపాల్ నుంచి పోటీ చేయాలని అద్వానీ అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆర్ఎస్ఎస్, పార్టీ జోక్యంతో ఆయన తన మనసు మార్చుకున్నట్లు చెబుదతున్నారు.

తాను ఎన్నికల్లో పోటీ చేయడంతోనే తన అనుబంధం గుజరాత్‌తో గానీ గాంధీనగర్‌తో గానీ ప్రారంభం కాలేదని, భారత స్వాతంత్ర్యం సందర్భంగా జరిగిన దురదృష్టకరమైన సంఘటననాడే ప్రారంభమైందని ఆయన చెప్పారు. దేశ విభజన తర్వాత తనకుటుంబం పాకిస్తాన్ నుంచి భారత్‌కు మారిందని ఆయన గుర్తు చేసుకున్నారు.

తమ కుటుంబం ఆదిపూర్‌కు మారినప్పుడు తనకు మూడు నాలుగేళ్ల వయస్సు మాత్రమే ఉందని, గుజరాత్‌తో తన అనుబంధం అప్పటి నుంచి ప్రారంభమైందని ఆయన చెప్పారు. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వెంట రాగా అద్వానీ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు.

English summary
Denying any row over his seat, veteran BJP leader L K Advani on Saturday said he never thought of not contesting from his traditional Lok Sabha seat of Gandhinagar and recalled his long association with Gujarat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X