వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారతదేశంలో మళ్ళీ 18వేలను దాటిన కరోనా కొత్తకేసులు; యాక్టివ్ కేసుల పెరుగుదలతో కొత్త ఆందోళన!!

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో కరోనా కేసులు భారీగా పెరిగిన పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. భారతదేశంలో గత 24 గంటల్లో 18,930 కొత్త కోవిడ్ కేసులు మరియు 35 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. ప్రస్తుతం కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 4.32 శాతంగా ఉంది

గత 24 గంటల్లో 4,38,005 పరీక్షలు నిర్వహించగా, ఇప్పటివరకు మొత్తం 86.53 కోట్ల పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలో యాక్టివ్ కోవిడ్-19 కేసుల సంఖ్యలో మరో 4,245 కేసులు పెరుగుదల నమోదయ్యింది. మొత్తం ఇన్‌ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.26 శాతం ఉండగా, జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.53 శాతంగా నమోదైంది. ప్రస్తుతం యాక్టివ్ కోవిడ్ కేసులు 1,19,457 కు పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

New Corona cases crossed 18 thousand in India; active cases rise; Omicron New Variant Concern!!

తాజాగా చోటు చేసుకున్న 35 మరణాలతో, భారతదేశంలో మరణించిన వారి సంఖ్య 5,25,305 కు చేరుకుంది. భారతదేశంలో 14,650 రికవరీలు గత 24 గంటల్లో నమోదయ్యాయి. ఇదిలా ఉంటే ఇప్పటివరకు, దేశవ్యాప్తంగా దాదాపు 4.8 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేయబడ్డాయి. సార్వత్రిక ఇమ్యునైజేషన్, రక్తదానం మరియు అవయవ దానం కోసం CoWin ప్లాట్‌ఫారమ్‌ను పునర్నిర్మించడానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తోంది. మేలో, కేంద్రం బూస్టర్ మోతాదు యొక్క నిర్వహణ నిబంధనలను సడలించింది.

భారతదేశం వంటి దేశాలలో కరోనావైరస్ యొక్క ఓమిక్రాన్ వేరియంట్ యొక్క కొత్త ఉప-వంశం BA.2.75 కనుగొనబడిందనీ, దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ జరుగుతున్న అధ్యయనాలను అనుసరిస్తోందని డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు. కోవిడ్-19లో, ప్రపంచవ్యాప్తంగా నివేదించబడిన కేసులు గత రెండు వారాల్లో దాదాపు 30 శాతం పెరిగాయి. దీంతో కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ప్రపంచ దేశాలకు సూచిస్తుంది. ముఖ్యంగా భారతదేశంలో ఓమిక్రాన్ యొక్క కొత్త సబ్ వేరియంట్ చెందుతున్న నేపథ్యంలో కరోనా నిబంధనలను పాటించాలని హెచ్చరిస్తున్నారు.

English summary
India reported 18,930 new Covid cases and 35 deaths in the last 24 hours. Active cases are reaching more than one lakh 19 thousand. And the new variant of Omicron BA 2.75 is worrying.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X