ఢిల్లీ-దర్భంగా ఎక్స్ ప్రెస్ లో మంటలు-తగులబడిన బోగీలు- ప్రయాణికులకు..
ఢిల్లీ నుంచి బీహార్ లోని దర్బంగాకు వెళ్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. తొలుత ఓ బోగీలో చెలరేగిన మంటలు.. ఆ తర్వాత రైలు వేగంగా ప్రయాణిస్తున్న క్రమంలో మిగతా బోగీలకు కూడా వ్యాపించాయి. మొత్తం మూడు బోగీలకు మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. చివరకు ట్రైన్ ను నిలిపివేశారు. ఈ ప్రమాదంతో ఢిల్లీ నుంచి బీహార్ బయలుదేరిన పలువురు ప్రయాణికులు షాక్ అయ్యారు.

Fire broke out in coach S-1 of train number – 02570 (Humsafar Express) going from New Delhi to Darbhanga near Sarai Bhupat railway station in Etawah. Rail traffic stopped!! pic.twitter.com/5XzfISlStK
— Ravi Chaturvedi (@Ravi4Bharat) November 15, 2023
న్యూ ఢిల్లీ-దర్భంగా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ యూపీలోని ఇటావాకు చేరుకున్న క్రమంలో మంటలు చెలరేగాయి. దీంతో ఎక్స్ ప్రెస్ రైలులో మూడు కోచ్‌లు దగ్దమయ్యాయి. అగ్నిప్రమాదంలో ప్రయాణికులు కొందరికి స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు. అధికారులు అందించిన వివరాల ప్రకారం ఈ రైలు సరాయ్ భూపత్ స్టేషన్ గూండా వెళుతున్నప్పుడు, స్లీపర్ కోచ్‌లో పొగలు రావడాన్ని స్టేషన్ మాస్టర్ గమనించారు. దీంతో వెంటనే రైలు డ్రైవర్, గార్డులకు సమాచారం అందించి రైలును నిలిపివేశారు. అనంతరం స్లీపర్ కోచ్ నుంచి ప్రయాణికులను బయటకు రప్పించారు.
Fire broke out in coach S-1 of train number – 02570 (Humsafar Express) going from New Delhi to Darbhanga near Sarai Bhupat railway station in Etawah. Rail traffic stopped!! pic.twitter.com/5XzfISlStK
— Ravi Chaturvedi (@Ravi4Bharat) November 15, 2023
మరోవైపు దర్భంగా రైలులో మంటలు అంటుకున్న వెంటనే పలువురు ప్రయాణికులు రైలు నుంచి దూకేశారని అధికారులు తెలిపారు. రైలులో దాని సామర్థ్యం కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే అగ్నిప్రమాదం యాదృచ్ఛికమా లేక విద్రోహ చర్యా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. అయితే ఎస్ 1 బోగీలో షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు ప్రాధమిక ఆధారాలను బట్టి తెలుస్తోంది. అధికారులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
-
విశాఖ-చర్లపల్లి ఎక్స్ ప్రెస్ లో కీలక మార్పు-ఇకపై ఇలా..! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమృత్ భారత్ రైలులో పురిటి నొప్పులు.. కట్ చేస్తే ఆసుపత్రికి వెళ్ళేలోపే..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్











Click it and Unblock the Notifications