తల్లీ, చెల్లెలు వ్యభిచారం చేస్తున్నారని, తుపాకులతో !
న్యూఢిల్లీ: తల్లీ, చెల్లెలు వ్యభిచారం చేస్తున్నారనే అనుమానంతో కొడుకు ఇద్దరిని తుపాకులతో కాల్చి చంపేశాడు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని నజాఫ్ ఘడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రేమ్ నగర్ లో నివాసం ఉంటున్న సునీత (40), ఆమె కుమార్తె (15) హత్యకు గురైనారు.
సునీతకు సుమీత్ (21) అనే కుమారుడు, 15 ఏళ్ల కుమార్తె ఉన్నారు. సునీత తన కుమార్తెతో కలిసి వ్యభిచారం చేస్తున్నది. తల్లీ, చెల్లెలు వ్యభిచారం చేస్తూ పరువు తీస్తున్నారని సుమీత్ ఆవేదన చెందాడు.
తల్లీ, చెల్లిని ఎలాగైనా హత్య చెయ్యాలని స్నేహితులు ధర్మాభీర్ (28), ప్రదీప్ (16)తో చర్చించాడు. చివరికి వీరు ఓ ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్ ప్రకారం ధర్మాభీర్ తన కారులో సునీత, ఆమె కుమార్తెను రాజస్థాన్ లోని సికర్ లో ఉన్న ఖటుశ్యాం దేవాలయం దగ్గరకు తీసుకు వెళ్లాడు.
దేవాలయంకు సమీపంలోని మానేసర్ లోని ఇండస్ట్రియల్ మోడల్ టౌన్ షిప్ ప్రాంతంలోకి తల్లీ, కుమార్తెను తీసుకువెళ్లారు. తరువాత సునీత, ఆమె కుమార్తెకు ముగ్గురు కలిసి దుప్పటా చుట్టి దేశీ తుపాకులతో కాల్చి చంపేశారు.

మృతదేహాలను సమీపంలోని మైదానంలో విసిరివేసి ఢిల్లీ వెళ్లిపోయారు. గుర్గావ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు అనుమానం వచ్చి సుమీత్ ను అదుపులోకి తీసుకుని విచారించారు.
తల్లీ, చెల్లెలు వ్యభిచారం చేస్తూ పరువు తీస్తున్నారని, అందుకే స్నేహితులతో కలిసి హత్య చేశానని సుమీత్ అంగీకరించాడు. 2000వ సంవత్సరంలో తన తండ్రి జై ప్రకాష్ కు తల్లి సునీత విషం పెట్టి హత్య చేసిందని సుమీత్ పోలీసులకు చెప్పాడు.
అయినా అప్పట్లో తన తల్లి సునీత మీద పోలీసులు కేసు నమోదు చెయ్యలేదని చెప్పాడని డీసీపీ కుహార్ వివరించారు. సుమీత్ తో పాటు ధర్మాభీర్, ప్రదీప్ లను అరెస్టు చేసి వారి నుంచి తుపాకులు, తూటాలు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ కుహార్ తెలిపారు.
ధర్మాభీర్ తండ్రి సత్యనారాయణ్ ఢిల్లీలో హెడ్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నారు. తల్లీ, కుమార్తె హత్య కేసు నుంచి మిమ్మల్ని రక్షిస్తానని సత్యనారాయణ్ వారికి హామీ ఇచ్చాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications