గుడిసెల కూల్చివేత: షాక్ ఇచ్చిన ఫోరెన్సిక్ నివేదిక
న్యూఢిల్లీ: ఢిల్లీలోని షాకూర్ గస్తీలో అక్రమ గుడిసెల తొలగింపు వ్యవహారంలో రెవెన్యూ, రైల్వే శాఖ అధికారులకు చుక్కెదురైయ్యింది. ఢిల్లీ సంజయ్ గాంధీ ఆసుపత్రి వైద్యలు ఇచ్చిన పోస్టుమార్టుం నివేదిక అధికారులకు చుక్కలు చూపించింది.
తలకు బలమైన గాయాలు అయ్యాయని, నాలుగు పక్కటెముకలు విరిగిపోవడం వలనే చిన్నారి (ఆరు నెలలు) మరణించిందని ఫోరెన్సిక్ నిపుణులు నివేదిక ఇచ్చి ప్రభుత్వానికి, అధికారులకు షాక్ ఇచ్చారు. షాకూర్ బస్తీ కూల్చివేత సందర్బంగా ఆరు నెలల చిన్నారి మరణించిన విషయం తెలిసిందే.
అయితే గుడిసెల కూల్చివేతకు, పాప మరణానికి ఎలాంటి సంబంధం లేదని సంబంధిత మంత్రివర్యులు, రైల్వే, రెవెన్యూ శాఖల అధికారులు ప్రకటించారు. అయితే ఇప్పుడు పోస్టుమార్టుం నివేదిక బయటకురావడంతో అందరూ అయోమయంలో పడ్డారు.

పాప మరణించి ఇప్పటికి 30 గంటలు అయ్యిందని పోస్టుమార్టుం నివేదికలో స్పష్టం చేశారు. ఈ విషయం పై ఢిల్లీ హైకోర్టు సైతం సీరియస్ గా స్పందించింది. గడ్డకట్టుకుపోయే చలిలో పేదల ఇళ్లు కూల్చడం అన్యాయమని న్యాయస్థానం ఆక్షేపింపించింది.
సంబంధిత అధికారులు అందరూ కోర్టు ముందు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మానవహక్కుల సంఘం ప్రభుత్వానికి, రైల్వే అధికారులకు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని సూచించింది.
ఢిల్లీలో ప్రతిపాదిత రైల్వే టెర్మినల్ నిర్మాణ ప్రాంతంలో ఉన్న గుడిసెలను శనివారం రాత్రి అధికారులు నేలమట్టం చేశారు. ఇదే సందర్బంలో ఓ చిన్నారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అనారోగ్యంతో పాప మరణించిందంటూ తప్పించుకోవడానికి ప్రయత్నించిన ప్రభుత్వం, అధికారులు అడ్డంగా బుక్కయ్యారు.












Click it and Unblock the Notifications