పోస్ట్ కోవిడ్ బాధితులకు కొత్త భయం .. బ్లాక్ ఫంగస్ తర్వాత బోన్ డెత్ టెన్షన్ .. ముంబైలో మూడు కేసులు !!
కరోనా మహమ్మారి బారిన పడిన వారిని బ్లాక్ ఫంగస్ మాత్రమే కాదు, ఇప్పుడు బోన్ డెత్ కూడా వణికిస్తోంది. కోవిడ్ -19 చికిత్స పొందిన చాలామందికి బ్లాక్ ఫంగస్ సోకిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా అవాస్కులర్ నెక్రోసిస్ లేదా ఎముక కణజాలాల మరణం కోవిడ్ బాధితులకు సోకటం ఆందోళన కలిగిస్తుంది .ఇప్పటివరకు మూడు బోన్ డెత్ కేసులు ముంబై నుండి నివేదించబడ్డాయి.
రెండు నెలల క్రితం మ్యూకోమైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ వ్యాప్తి మొదలైంది. ఇప్పుడు తాజాగా పోస్ట్ కోవిడ్ సమస్యగా బోన్ డెత్ కూడా ఒకటిగా మారుతుంది. రాబోయే కొద్ది నెలల్లో అవాస్కులర్ నెక్రోసిస్ కేసులు కూడా ఎక్కువగా ఉంటాయని వైద్యులు భయపడుతున్నారు.
మీడియా కథనాల ప్రకారం హిందూజా హాస్పిటల్ లో కోవిడ్ కు చికిత్స పొందిన రెండు నెలల తర్వాత నెక్రోసిస్ అభివృద్ధి చెందిన ముగ్గురు 40 సంవత్సరాల వయసున్న రోగులకు చికిత్స చేశారు.

ఈ రోగులు వారి తొడ ఎముకలో విపరీతమైన నొప్పి ఉందని చెప్పటంతో బోన్ డెత్ లక్షణాలను గుర్తించి చికిత్స కోసం తరలించారు. అయితే అవాస్కులర్ నెక్రోసిస్, మ్యూకోర్ మైకోసిస్ స్టెరాయిడ్ల వాడకం వల్ల వస్తుందని భావిస్తున్నారు. 'లాంగ్ కోవిడ్ -19 లో భాగంగా అవాస్కులర్ నెక్రోసిస్', ప్రతిష్టాత్మక వైద్య పత్రిక 'బిఎమ్‌జె కేస్ స్టడీస్' లో డాక్టర్ అగర్వాల్ యొక్క పరిశోధనా పత్రం, ప్రచురించబడింది. కోవిడ్ -19 కేసులలో ప్రాణాలను రక్షించడం కోసం కార్టికోస్టెరాయిడ్స్ పెద్ద ఎత్తున ఉపయోగించడం వలన అవాస్కులర్ నెక్రోసిస్ కేసులు పెరుగుతున్నాయని ఆయన అన్నారు.
ఇదిలావుండగా, కోయంబత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో మ్యూకోర్ మైకోసిస్ ఉన్న 264 మంది రోగులలో 30 మంది ఒక కంటిలో దృష్టి కోల్పోయారని ఆసుపత్రి ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్న 30 మంది రోగులు ఒక కంటిలో దృష్టి కోల్పోయారని, ప్రారంభ దశలో వచ్చిన వారికి ఈ వ్యాధిని పూర్తిగా నయం చేశారని ఆమె పేర్కొన్నారు. అలాగే, యాంఫోటెరిసిన్-బి యొక్క అదనపు 2,12,540 మోతాదులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు (యుటిలు) మరియు కేంద్ర సంస్థలకు ప్రభుత్వం కేటాయించినట్లు కేంద్ర మంత్రి సదానంద గౌడ ఇటీవల తెలిపారు.బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఆంఫోటెరిసిన్-బి ఉపయోగించబడుతుంది, బ్లాక్ ఫంగస్ ముక్కు, కళ్ళు, సైనసెస్ మరియు కొన్నిసార్లు మెదడును కూడా దెబ్బతీస్తుంది.
Recommended Video
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications