కొత్త ప్రధాన అర్చకుడి చేతుల మీదుగా తెరచుకున్న శబరిమల అయ్యప్పస్వామి ఆలయం తలుపులు
తిరువనంతపురం: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేరళలోని శబరిమల దేవస్థానానికి కొత్త ప్రధాన అర్చకుడిగా ఎంపికైన ఎన్ పరమేశ్వరన్ నంబూద్రి బాధ్యతలను స్వీకరించారు. ఆయన చేతుల మీదుగా ఆలయం తలుపులు తెరచుకున్నాయి. ఈ తెల్లవారు జామున 4 గంటలకు వృశ్చిక లగ్నంలో సంప్రదాయబద్ధంగా మణికంఠుడికి పూజలను నిర్వహించిన అనంతరం ఆలయ తలుపులను పరమేశ్వర్ నంబూద్రి తెరిచారు. అనంతరం అయ్యప్పుడి భక్తులకు సన్నిధానంలోకి ప్రవేశించడానికి అనుమతి ఇచ్చారు.

సోమవారం సాయంత్రం పాత ప్రధాన అర్చకుడి చేతుల మీదుగా..
మండలం-మకరవిళక్కు పూజల కోసం సోమవారం సాయంత్రం 5 గంటలకు శబరిమల ఆలయాన్ని తెరిచిన విషయం తెలిసిందే. ప్రధాన అర్చకుడు వీకే జయరాజ్ పొత్తి ఆలయాన్ని తెరిచారు. తంత్రి కందరు మహేష్ మోహనరు సమక్షంలో స్వామివారి గర్భగుడిని తెరిచారు. స్వామివారికి పూజలను నిర్వహించిన అనంతరం పదవీ విరమణ చేశారు. తన బాధ్యతలను పరమేశ్వరన్ నంబూద్రికి అప్పగించారు. ఈ తెల్లవారు జామున ఆయన గర్భగుడి ఆలయం తలుపులను తెరిచారు.

26వ తేదీ వరకు మండలం పూజలు..
అలాగే- మాలికాప్పురం అమ్మవారి ఆలయానికి కూడా ప్రధాన అర్చకుడిగా కొత్తగా నియమితులైన శంభు నంబూద్రి కూడా బాధ్యతలను స్వీకరించారు. మండలం-మకరవిళక్కు పూజలు డిసెంబర్ 26వ తేదీ వరకు కొనసాగుతాయి. మండలం పూజ అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు అర్చకులు. మళ్లీ అదేనెల 30వ తేదీన మకరవిళక్కు పూజల కోసం తెరుస్తారు. కొత్త సంవత్సరం జనవరి 20వ తేదీ వరకు తెరచి ఉంచుతారు.

జనవరి 20 వరకు ఓపెన్..
అయ్యప్పుడిని దర్శించుకోవడానికి 19వ తేదీ వరకే భక్తులకు అనుమతి ఉంటుంది. జనవరి 14వ తేదీన జ్యోతి దర్శనం ఉంటుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి రోజూ 30 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఆన్‌లైన్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా కరోనా వైరస్ నెగెటివ్ సర్టిఫికెట్ లేదా- రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న భక్తులు.. దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా అందజేయాల్సి ఉంటుంది.

ఎవరీ పరమేశ్వరన్..
నారాయణన్ నంబూద్రి, సుభద్ర అంతర్జనం దంపతుల కుమారుడు పరమేశ్వరన్. ఇదివరకు ఆయన హరిపద్‌లోని ఛెట్టికులంగారా ఆలయం, పంపా మహాగణపతి దేవస్థానాలకు ప్రధాన అర్చకుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఎవూర్‌లోని శ్రీకృష్ణస్వామి దేవస్థానంలో పని చేస్తోన్నారు. పరమేశ్వరన్ వివాహితుడు. ఆయన భార్య పేరు ఉమాదేవి అంతర్జనం. ఆయనకు ఇద్దరు కుమారులు నారాయణన్ నంబూద్రి, విష్ణు నంబూద్రి ఉన్నారు. పరమేశ్వరన్ స్వస్థలం అళప్పుజ జిల్లాలోని మావెలిక్కర.

లక్కీ డ్రా ద్వారా..
కిందటి నెల 17వ తేదీన శబరిమల ఆలయంలో నిర్వహించిన లక్కీ డ్రా సందర్భంగా పరమేశ్వరన్‌ను ఎంపిక చేశారు. తొలుత- ప్రధాన అర్చకుడి కోసం ఎంపిక చేసిన తొమ్మిదిమంది పేర్లు రాసిన చీటీలతో కూడిన ఓ వెండి పాత్రను అయ్యప్ప స్వామి వద్ద ఉంచారు. ప్రత్యేక పూజలను నిర్వహించారు. పూజల అనంతరం వెండి పాత్రను తెరచి అందులో చేతికి అందిన చీటీ ద్వారా ప్రధాన అర్చకుడి పేరును ప్రకటించారు. సుదీర్ఘకాలం నుంచి వస్తోన్న ఆనవాయితీ ప్రకారం.. పండలం కుటుంబీకులు ఈ లాటరీని తీయాల్సి ఉంటుంది.

మాజీ న్యాయమూర్తుల పర్యవేక్షణలో
పండలం కుటుంబీకుడు గోవింద వర్మ లాటరీ తీశారు. అందులో పరమేశ్వరన్ నంబూద్రి పేరు రావడంతో.. ఆయనను శబరిమల దేవస్థానం ప్రధాన అర్చకుడిగా ప్రకటించారు. దేవస్వొం బోర్డు అధ్యక్షుడు ఎన్ వాసు, కేరళ హైకోర్టు పరిశీలకుడిగా రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్ భాస్కరన్.. ఈ లాటరీని పర్యవేక్షించారు. ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు. మాలికాప్పురం దేవి దేవస్థానం ప్రధాన అర్చకుడిగా ఎంపికైన శంభు నంబూద్రి.. స్వస్థలం కన్నూర్ జిల్లాలోని పరియారం. కోజికోడ్‌లో నివాసం ఉంటున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications