• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పరీక్ష హాల్లో విద్యార్థుల తలలకు అట్టపెట్టెలు..! ఎందుకో తెలుసా...?

|

పరీక్షలంటే వ్యక్తిగత ప్రతిభకు నిదర్శనం. పరీక్షల్లో వచ్చే మార్కులను బట్టే విద్యార్థియొక్క తెలివితేటలను అంచనా వేస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకోంది. ఇందుకోసం విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం సృజనాత్మకత చదువుల విధానం నుండి బట్టి విధానంతో పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఇదే విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. భట్టి విధానంతో సగం మాత్రమే గుర్తుండి మరో సగం జవాబుకోసం ఇతరులపై ఆధారపడాల్సి వస్తున్న పరిస్థితి. దీంతో మాస్‌కాపియింగ్ విధానం కాలేజీ యాజమాన్యాలను భయబ్రాంతులకు గురిచేస్తోంది.

మాస్‌కాపియింగ్‌తో తలనొప్పి

మాస్‌కాపియింగ్‌తో తలనొప్పి

కాని యూనివర్సిటి స్థాయిలో కూడ ఇదే విధానం కోనసాగుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యూనివర్సిటీ స్థాయిలో చదివే డిగ్రి , ఇతర పీజీ కోర్సుల విద్యార్థులు కూడ పరీక్షల్లో పాస్ కోవడం పక్కచూపులు చూస్తుండడం సర్వసాధరణంగా మారిపోయింది. కొన్ని సంధర్భాల్లో పక్కవారి పేపర్లను మక్కిమక్కికి కాపి కోడుతున్న సంధర్భాలు కోకొల్లలుగా బయటపడతున్నాయి. దీంతో పరీక్షల్లో బాగానే మార్కులు తెచ్చుకుంటున్న విద్యార్థులు సరిగ్గా ప్రతిభ చూపించే సమయానికి వెనకడుగువేస్తున్నారు. పని చేసే దగ్గర కూడ తిరిగి ఓనమాలు నేర్చుకునే పరిస్థితి నెలకోంది. దీంతో పరీక్షలు నిర్వహించే యూనివర్శీటీలు, ఆయా కాలేజీలపై పలు అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. వీటిని అరికట్టెంందుకు పరీక్షహాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయడంతో ఇతర ఏర్పాట్లను పకడ్బందిగా చేస్తున్నారు.

 విద్యార్థుల తలలకు అట్టపెట్టెలు

విద్యార్థుల తలలకు అట్టపెట్టెలు

అయితే కర్నాటకలోని హవేరిలో ఓ కాలేజీ మాత్రం మాస్ కాపియింగ్ జరగకుండా విన్నూత్న మరియు వివాస్పద ఆలోచన చేసింది. అసలు విద్యార్థులు తలలు తిప్పి, ఇతర విద్యార్థుల పేపర్లను చూస్తేనే కదా మాస్ కాపియింగ్ జరిగేది అనుకున్నారు. తలలు తిప్పకుండా ఒకరినొకరు చూడకుండా చేస్తే.. మాస్‌ కాపియింగ్ ఉండదనే అలోచనకు పదును పెట్టారు. ఈనేపథ్యంలోనే కర్ణాటకలోని భగత్ కాలేజీకి చెందిన విద్యార్థులకు మిడ్‌టర్మ్ పరీక్షలు జరుగుతున్నాయి. ఆక్టోబర్ 16న జరిగిన పరీక్షలకు హజరైన విద్యార్థులకు అట్టపెట్టెలు ఇచ్చారు. వాటిని తలలపై అట్టపెట్టుకుని పరీక్షలు రాయాలని ఆదేశాలు జారీ చేశారు. కేవలం పరీక్ష పేపరు మీదే చూపు ఉండేవిధంగా అట్టపెట్టెకు ఒకవైపు హోల్ చేశారు.

కాలేజీ తీరుపై ఫైర్ అయిన అధికారులు

కాలేజీ తీరుపై ఫైర్ అయిన అధికారులు

ఇక తాము చేస్తున్న గొప్ప పనిని ఇతరులకు తెలిపేందుకు అట్టపెట్టెలను తలలపై పెట్టుకుని పరీక్షలు రాసే విద్యార్థులు ఫోటోలను గ్రూప్‌లో ఉన్న అడ్మినిస్ట్రేటర్ ఒకరు కాలేజీ వాట్సప్ గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఆ ఫోటో పూర్తిగా వైరల్‌గా మారింది. యూనివర్శీటి డిప్యూటి డైరక్టర్ నేరుగా పరీక్ష సెంటర్‌ను పరీశీలించారు. పలువురు విద్యార్థులు అట్లపెట్టెలను తలపై పెట్టుకుని పరీక్షలు రాస్తుండడం ఆయన గమనించాడు. దీనిపై కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించడంతో... మాస్ కాపియింగ్ జరగకుండా విద్యార్థులపై ఎక్స్‌పరిమెంట్ చేస్తున్నామని చెప్పడంతో ఆయన షాక్ తిన్నాడు. అనంతరం జరిగిన సంఘటనపై వివరణ ఇవ్వాలని కాలేజీ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

English summary
the students of the Bhagat PU College have written the exams put specially modified cartons to cover their heads for avoiding malpractice in Haveri in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X