Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గుడ్ న్యూస్..భారత్ నుంచి ఆదేశానికి త్వరలో కొత్త రైలు..!!

పొరుగు దేశాల మధ్య రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తోంది.ఇందులో భాగంగా భూటాన్‌ దేశానికి రైలు కనెక్టివిటీ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోదీ విజన్ అయిన యాక్ట్ ఈస్ట్ పాలసీ, నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీల ద్వారా పొరుగుదేశాల్లో పలు రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది.

మోదీ విజన్..
ఇక ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌కు అనుగుణంగా భారతీయ రైల్వేస్ కోక్రాఝార్ గెలెఫు మధ్య కొత్త రైల్వే లైన్‌ను నిర్మించేందుకు ప్రతిపాదించింది. ఈ రైల్వే లైన్ ద్వారా అస్సాం భూటాన్ మధ్య కనెక్టివిటీ రానుంది. భారత్-భూటాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఈ రైల్వే లైన్‌తో మరింత బలపడుతాయి.గత నెలలో జరిగిన అడ్వాంటేజ్ అస్సోం 2.0 సదస్సు సందర్భంగా రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ మేరకు ప్రకటన చేశారు.

New railway line from Assam to Bhutan- Modis Vision to strength bilateral ties-Details here

మొత్తం రూ.3500 కోట్లు అంచనా
అస్సాం రాష్ట్రంలోని కోక్రాఝార్‌ రైల్వే స్టేషన్‌ను భూటాన్ దేశంలోని గెలెఫు స్టేషన్‌ను సరికొత్త రైల్వే లైన్ కనెక్ట్ చేస్తుంది. మొత్తం 69.04 కిలోమీటర్ల మేరా ఉండే ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ.3500 కోట్లుగా అంచనా వేసింది ప్రభుత్వం.ఈ రెండు స్టేషన్ల మధ్య మరో ఆరు కొత్త స్టేషన్ల నిర్మాణం జరుగుతుంది. బాలాజన్, గరుభాసా, రునిఖాతా, శాంతిపూర్, దాద్‌గిరి, గెలెఫు రైల్వే స్టేషన్ల నిర్మాణం జరుగుతుంది.

ఇక కోక్రాఘార్ రైల్వే స్టేషన్ నుంచి గెలెఫు రైల్వే స్టేషన్ మధ్య రెండు ప్రధాన వంతెనలను నిర్మించాల్సి వస్తుంది. వీటికి అదనంగా మరో 29 బ్రిడ్జీలను కూడా నిర్మిస్తారు. 65 చిన్న బ్రిడ్జీలు, ఒక రోడ్ ఓవర్ బ్రిడ్జి,39 అండర్ రోడ్ బ్రిడ్జీల నిర్మాణం చేపట్టనుంది.ఈ మేరకు సర్వే కూడా పూర్తయినట్లు సమాచారం. డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు) ప్రభుత్వానికి అందజేసినట్లు తెలుస్తోంది. అయితే డీపీఆర్‌కు ఆమోదంతో పాటు కొన్ని మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే సూచనలు చేయాల్సి ఉంటుది. అంతా సవ్యంగా సాగితే భూటాన్‌కు త్వరలో కొత్త రైలు నడుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

భారత్-భూటాన్ మధ్య సత్సంబంధాలు
ఇక ప్రతిపాదన చేసిన రైల్వే లైన్ నిర్మాణంతో భారత్ - భూటాన్ దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి.ఇరు దేశాల మధ్య సంస్కృతి, వాణిజ్యం, పర్యాటక సంబంధాలు బలపడతాయి.అంతేకాదు భూటాన్ యొక్క రవాణా వ్యవస్థ కూడా బలోపేతం కావడమే కాకుండా ఆదేశంలో తొలిసారిగా ఒక రైల్వే కనెక్షన్ వచ్చినట్లవుతుంది.

అంతేకాదు బోడోలాండ్‌కు వాణిజ్య అవసరాల నిమిత్తం ఇదే రైల్వే లైన్ ఒక రవాణా వ్యవస్థగా మారుతుంది.తద్వారా స్థానికింగా వాణిజ్యం పెరగడమే కాకుండా అక్కడి ప్రజలకు కూడా ఉపయోగకరంగా మారుతుంది. మొత్తంగా చూసుకుంటే అస్సాం - భూటాన్ రైల్వే కనెక్టివిటీ వాస్తవరూపం దాలిస్తే బోడోలాండ్ ఆర్థిక వ్యవస్థ బలపడటమే కాదు, కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. తద్వారా దీర్ఘకాలంలో వృద్ధి అభివృద్ధికి ఈ ప్రాంతం నోచుకుంటుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+