వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రాప్‌లో దీదీ: టీఎంసీలో చీలిక: అల్లుడిని దువ్వుతున్న బీజేపీ: రాత్రికి రాత్రి మమత కోటకు బీటలు?

|
Google Oneindia TeluguNews

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనత పార్టీ సరికొత్త వ్యూహాన్ని తెర మీదికి తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి మమత బెనర్జీ సారథ్యంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌ను నిట్టనిలువుగా చీల్చడానికి మైండ్ గేమ్‌ను ఆరంభించినట్టయింది. ఈ క్రమంలో మమత బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని ముందు పెట్టినట్టుగా చెబుతున్నారు. మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే తరహాలో పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌ను చీలికను తీసుకుని రావడానికి ఆయన పేరును వాడుకుంటోందనే వాదనలు ఉన్నాయి.

కొత్తగా బ్యానర్లు..

కొత్తగా బ్యానర్లు..

ఈ తరహా అభిప్రాయాలు వెల్లువెత్తడానికి కారణాలు లేకపోలేదు. రాజధాని కోల్‌కత సహా పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా కొత్తగా పుట్టుకొచ్చిన బ్యానర్లు, పోస్టర్లే దీనికి నిదర్శనం. ఆరు నెలల్లో కొత్త తృణమూల్ కాంగ్రెస్ ఆవిర్భవించబోతోందనేది ఈ బ్యానర్లు, పోస్టర్లలోని సారాంశం. దీనితో- కొత్తగా ఆవిర్భవించబోయే టీఎంసీకి అభిషేక్ బెనర్జీ సారథ్యాన్ని వహిస్తారనే ప్రచారం ఊపందుకుంది. పార్టీలో చీలికను తీసుకుని రావడం ద్వారా మమత బెనర్జీ ప్రభుత్వాన్ని మైనారిటీలో పడేయాలనేది బీజేపీ వ్యూహంగా చెబుతోన్నారు.

ముఖ్యమంత్రిగా అభిషేక్.. డిప్యూటీగా..

ముఖ్యమంత్రిగా అభిషేక్.. డిప్యూటీగా..

మహారాష్ట్ర తరహాలో చీలిక వర్గానికి మద్దతును ఇవ్వడం ద్వారా ఆ పార్టీతో కలిసి పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా బీజేపీ పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. చీలిక వర్గ నేత అభిషేక్ బెనర్జీ ముఖ్యమంత్రిగా.. బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఈ వాదనలన్నింటికీ- ఇప్పుడు తాజాగా వెలిసిన బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలు కేంద్రబిందువు అయ్యాయి.

టీఎంసీ లోగో..

టీఎంసీ లోగో..

ఈ బ్యానర్లుల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల గుర్తును కూడా ముద్రించారు. తృణమూల్​‌కు కంచుకోటగా ఉంటూ వస్తోన్న హజ్రా సహా పలు ప్రాంతాల్లో ఇవి వెలిశాయి. వాటిల్లో ఎక్కడే గానీ మమత బెనర్జీ ఫొటోలు లేవు. ప్రజలు కోరుకుంటున్నట్టే.. ఆరు నెలల్లో కొత్త టీఎంసీ వస్తుంది అని సందేశాన్ని క్లుప్తంగా వాటిల్లో పొందుపరిచారు. మమత బెనర్జీ అధికారిక నివాసం ఉన్న ప్రాంతానికి అతి సమీపంలోనూ వాటిని ఏర్పాటు చేశారు.

 అవినీతి అస్త్రం..

అవినీతి అస్త్రం..


మమత బెనర్జీ ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. మంత్రి పార్థ ఛటర్జీ ఇప్పటికే ఈడీ విచారణను ఎదుర్కొంటోన్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే కారణంతో ఆయనను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కోట్లాది రూపాయల బ్లాక్ మనీ ఉన్నట్లు గుర్తించారు. పార్థ ఛటర్జీ సమీప బంధువు అర్పిత ఛటర్జీ కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ పరిణామాల మధ్య- ఆరు నెలల్లో కొత్త టీఎంసీ అనే పోస్టర్లు, వాటిపై అభిషేక్ బెనర్జీ ఫొటోలు బయటికి రావడం కలకలం రేపుతోంది.

English summary
The hoardings come even as multiple senior TMC leaders are under the scanner of government agencies for alleged corruption on a host of issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X