Shock: ఎస్ యూవీ కారులో కంపెనీ ఉద్యోగులు, బస్సులో ప్రయాణికులు, 9 మంది దుర్మరణం, 32 మందికి ?

అహమ్మదాబాద్/గుజరాత్: ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వారు ఫార్చ్యూనర్ కారులో బయలుదేరారు. ప్రతినిత్యం ఓరూట్ లో బస్సు సంచరిస్తోంది. బస్సులో ప్రయాణికుల రద్దీకూడా ఎక్కువగానే ఉంటుంది. నూతన సంవత్సరం వేడుకలు గ్రాండ్ గా చేసుకోవాలని అందరూ సిద్దం అవుతున్న సమయంలో ఫార్చ్యూనర్ కారు- బస్సు ఢీకొనడంతో ఆరోడ్డు మీద శవాలు చెల్లాచెదురుగా పడ్డాయి.

గుజరాత్‌లోని నవ్‌సారిలో బస్సు, ఫార్చ్యూనర్ కారు మధ్య జరిగిన ఘోర ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. ఇదే ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 32 మందికి తీవ్రగాయాలైనాయి. ఈ ప్రమాదంలో గాయపడిన 32 మందిలో 17 మందిని వల్సాద్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో 14 మందిని నవాన్‌సారిలోని ఆసుపత్రుల్లో చేర్పించారు.

New Year: Nine people were killed and 32 injured in a horrific accident between a car and bus in Gujarat.

విషమంగా ఉన్న మరో వ్యక్తిని మురుగైన చికిత్స కోసం సూరత్‌కు తరలించినట్లు అదనపు జిల్లా కలెక్టర్ కేతన్ జోషి మీడియాకు తెలిపారు. తొమ్మిది మృతదేహాలను పోలీసు బృందాలు పోస్టుమార్టం నిమిత్తం తరలించారని కేతన్ జోషి తెలిపారు. ఫార్చ్యూనర్ కారులో తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నారు. కారులో ప్రయాణిస్తున్న వారు ఒక సంస్థలో ఉద్యోగాలు చేస్తున్నారని పోలీసులు చెప్పారు.

New Year: Nine people were killed and 32 injured in a horrific accident between a car and bus in Gujarat.

అహమ్మదాబాద్ నుండి వల్సాద్‌కు బస్సు బయలుదేరిందని, బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు అన్నారు. వేగంగా వెలుతున్న బస్సు- కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అన్నారు. న్యూఇయర్ వేడుకులకు కారులో కంపెనీ ఉద్యోగులు బయలుదేరారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+