Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పెళ్లైన నాలుగు రోజులకే.. పాపం ఆ భర్త ఎంతగానో ప్రయత్నించాడు కానీ...

పెళ్లైన నాలుగు రోజులకే ఓ వివాహితకు నూరేళ్లు నిండాయి. పాపం.. ఆమె భర్త కూడా ఆమెను కాపాడుకునేందుకు విశ్వప్రయత్నం చేశాడు. తమను రక్షించడానికి ఎవరైనా రాకపోతారా అని ఆశగా ఎదురుచూశాడు.

సిమ్లా: పెళ్లైన నాలుగు రోజులకే ఓ వివాహితకు నూరేళ్లు నిండాయి. పాపం.. ఆమె భర్త కూడా ఆమెను కాపాడుకునేందుకు విశ్వప్రయత్నం చేశాడు. తమను రక్షించడానికి ఎవరైనా రాకపోతారా అని ఆశగా ఎదురుచూశాడు. కానీ విధి బలీయం.

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కాంగ్రా జిల్లాలోని ఇందౌరాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అల్కాదేవి (21) దుర్మరణం పాలైంది. ఆమె భర్త సునీల్ కుమార్ ఆమెను కాలేజీలో వదిలిపెట్టేందుకు బైక్ పై ఎక్కించుకుని వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది.

Newly married woman dies in a mishap

మార్గం మధ్యలో సునీల్ కుమార్ ఓ బస్ ను ఓవర్ టేక్ చేస్తుండగా బైక్ స్కిడ్ అయింది. దీంతో అల్కాదేవి బస్సు చక్రాల కిందకు వెళ్లిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె కొనప్రాణంతో కొట్టుమిట్టాడింది.

భార్యను కాపాడుకునేందుకు సునీల్ కుమార్ అరగంటపాటు ఎంతగానో ప్రయత్నించాడు. చివరికి 108 వాహనం రావడంతో ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే అల్కాదేవి ప్రాణం విడిచింది.

సునీల్ కుమార్ కు నవంబర్ 14న అల్కాతో పెళ్లయింది. ఆమె బీఎస్సీ చదువుతోంది. కాలేజీకి వెళ్లాలని చెప్పడంతో తాను బైక్ పై విడిచిపెడతానంటూ ఆమె భర్త సునీల్ కుమార్ కూడా బయలుదేరాడు.

విధి వక్రీకరించి రోడ్డు ప్రమాదం రూపంలో అల్కాదేవిని మృత్యువు కబళించింది. అంబులెన్స్ మరికాస్త ముందు వచ్చినా తన భార్య బతికుండేదంటూ సునీల్ కుమార్ విలపించడం చూపరులను కదిలించి వేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+