Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దేశ తదుపరి సీజేఐ ఆయనే! జస్టిస్ బీఆర్ గవాయ్ ఓటు ఆయనకే!!

భారత అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ బీఆర్ గవాయ్ రిటైర్మెంట్‌కు మరో నెల రోజులే మిగిలి ఉంది. జస్టిస్ బీఆర్ గవాయ్ నవంబర్ 23న తన పదవి నుంచి వైదొలగనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వారసుడిని నియమించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం గురువారం అధికారికంగా ప్రారంభించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

సాంప్రదాయం ప్రకారం.. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి 65 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేయడానికి ఒక నెల ముందు కేంద్ర న్యాయ శాఖ మంత్రి ఆయనను సంప్రదిస్తారు. తదుపరి సీజేఐగా ఎవరిని నియమించాలనే దానిపై సిఫార్సు కోరుతూ జస్టిస్ బీఆర్ గవాయ్‌కి కేంద్రం త్వరలో లేఖ పంపనుంది. ఈ లేఖ ఈ సాయంత్రం లేదా శుక్రవారం అందజేయబడుతుందని సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియ గురించి తెలిసిన అధికారులు వెల్లడించారు.

Next Chief Justice of India Justice Suryakant Set to Take Office After Justice BR Gavai Retirement

నియామక నియమాలు ఏం చెబుతున్నాయంటే?
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలు, పదోన్నతులను నిర్దేశించే కీలక పత్రమైన మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్ (MoP) ప్రకారం, భారత ప్రధాన న్యాయమూర్తి పదవికి నియామకం అనేది సుప్రీంకోర్టులోని న్యాయమూర్తుల్లో అత్యంత సీనియర్‌గా ఉన్న, ఆ పదవిని నిర్వహించడానికి అర్హత కలిగిన వ్యక్తికి ఇవ్వబడాలి. కేంద్ర న్యాయ శాఖ మంత్రి తగిన సమయంలో పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి, ఆయన వారసుడి నియామకానికి సిఫార్సు చేయాలని కోరడం ఈ ప్రక్రియలో అంతర్భాగం.

తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్య కాంత్
సుప్రీంకోర్టులో సీనియారిటీ పరంగా ప్రస్తుత సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ తర్వాత జస్టిస్ సూర్య కాంత్ అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు. భారత న్యాయవ్యవస్థకు అధిపతిగా బాధ్యతలు చేపట్టడానికి ఆయన తదుపరి వరుసలో ఉన్నారు. యమావళి ప్రకారం.. జస్టిస్ సూర్య కాంత్ తదుపరి సీజేఐగా నవంబర్ 24న బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన ఫిబ్రవరి 9, 2027 వరకు దాదాపు 15 నెలల సుదీర్ఘ కాలం పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించనున్నారు. దేశ న్యాయ చరిత్రలో అత్యంత కీలకమైన ఈ నియామకం ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కావడంతో త్వరలోనే కొత్త సీజేఐ పేరు ఖరారు కానుంది.

జస్టిస్ సూర్యకాంత్ అసాధారణ ప్రస్థానం, దేశ తదుపరి సీజేఐగా నియామకం!
హర్యానాలోని హిస్సార్ నుండి దేశ అత్యున్నత న్యాయస్థానం పీఠం వరకు చేరుకున్న జస్టిస్ సూర్యకాంత్ కథ స్ఫూర్తిదాయకం. సాధారణ కుటుంబం నుంచివచ్చిన ఈ న్యాయమూర్తి తన కఠోర శ్రమ, నిజాయితీ,న్యాయం పట్ల ఉన్న అభిరుచితో సుప్రీంకోర్టు వరకు ప్రయాణించారు. ఇప్పుడు ఆయన నవంబర్ 24, 2025 న భారతదేశ తదుపరి ప్రధాన న్యాయమూర్తి (CJI)గా బాధ్యతలు స్వీకరించి, ఫిబ్రవరి 2027 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. చదువు నుంచిసుప్రీంకోర్టు వరకు ఆయన ప్రయాణం పోరాటం, పట్టుదల,కితభావంతో నిండి ఉంది.

విద్యతో బలమైన పునాది
జస్టిస్ సూర్యకాంత్ ఫిబ్రవరి 10, 1962 న హర్యానాలోని హిస్సార్‌లో జన్మించారు. 1981లో హిస్సార్‌లోని గవర్నమెంట్ పీజీ కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1984లో రోహ్తక్‌లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుండి ఎల్ఎల్‌బీ (లా) డిగ్రీని పొందారు. 2011లో కురుక్షేత్ర యూనివర్సిటీ నుంచి ఎంఎల్‌ఎల్ (మాస్టర్ ఆఫ్ లా)లో ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ర్యాంక్‌తో ఉత్తీర్ణులయ్యారు. 1984 లో హిస్సార్ జిల్లా కోర్టులో వృత్తిని ప్రారంభించిన ఆయన.. త్వరలోనే 1985 లో చండీగఢ్‌కు మారి పంజాబ్-హర్యానా హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. ఆయన రాజ్యాంగ (Constitutional), సివిల్, సర్వీస్ కేసులలో నైపుణ్యం సంపాదించారు. అనేక విశ్వవిద్యాలయాలు, బోర్డులు, బ్యాంక్‌లకు న్యాయ సలహాదారుగా కూడా పనిచేశారు.

ఉన్నత న్యాయస్థానం నుంచి సర్వోన్నత న్యాయస్థానం వరకు..
న్యాయవాద వృత్తిలో ఆయన చూపిన ప్రతిభ కారణంగా ఆయనను పంజాబ్-హర్యానా హైకోర్టుకు అడ్వకేట్ జనరల్‌గా నియమించారు. 2004లో ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డారు. ఆ తర్వాత ఆయన హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆయన స్పష్టమైన ఆలోచన, నిష్పాక్షికమైన తీర్పులు, న్యాయ దృక్పథం ఆయనను సుప్రీంకోర్టు వరకు చేర్చాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+