ఎన్‌ఐఏ అధిపతిగా.. గుజరాత్ అల్లర్ల ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారి!

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి వైసీ మోడీని కేంద్రప్రభుత్వం నియమించింది. మోడీ నియామకానికి అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ (ఏసీసీ) ఆమోదం తెలిపింది.

ఈ మేరకు సోమవారం డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) ఉత్తర్వులు జారీచేసింది. వైసీ మోడీ ఎన్‌ఐఏ డీజీగా 2021 మే 31 వరకు కొనసాగుతారని అందులో పేర్కొంది. దీంతోపాటు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా ఎన్‌ఐఏలో వెంటనే చేరుతారని కూడా తెలిపింది.

Next NIA Chief YC Modi was part of Gujarat Roit SIT

1984 బ్యాచ్‌కు చెందిన వైసీ మోడీ అసోం-మేఘాలయ క్యాడర్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 2002లో గుజరాత్ అల్లర్లపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)లో సభ్యునిగా ఉన్నారు. ప్రస్తుత ఎన్‌ఐఏ అధిపతి శరద్‌కుమార్ నుంచి అక్టోబర్ 30న వైసీ మోడీ బాధ్యతలు స్వీకరిస్తారు.

2013 జూలైలో ఎన్‌ఐఏ చీఫ్‌గా నియమితులైన శరద్ పదవిని కేంద్రం ఇప్పటికే రెండుసార్లు పొడిగించింది. ఎన్‌ఐఏ డీజీగా ఆయన అత్యధిక కాలం పనిచేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి రజనీకాంత్ మిశ్రాను సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ) డైరెక్టర్ జనరల్‌గా డీవోపీటీ నియమించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Appointments Committee of the Cabinet (ACC) on Monday approved the appointment of senior Indian Police Service (IPS) officers YC Modi as new chief of National Investigation Agency (NIA) and Rajni Kant Misra as Director General of Sashastra Seema Bal (SSB). Modi, a 1984-batch IPS officer of the Assam-Meghalaya cadre, is special director in CBI. He will succeed Sharad Kumar, who will complete his tenure on October 30, the order said. Modi was part of the Supreme Court-appointed Special Investigation Team that probed the 2002 Gujarat riot cases.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి