ధర్డ్ వేవ్ పై WHO క్లారిటీ-వచ్చే రెండు వారాలే కీలకం-ఏం జరగబోతోంది ?

భారత్ లో ధర్డ్ వేవ్ పై జనంలో భయాలు పెరుగుతున్నాయి. రోజుకో రకం వార్తలతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. ఓవైపు సాధారణ కోవిడ్ కేసులు, మరోవైపు ఓమిక్రాన్ వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో భారత్ లో ధర్డ్ వేవ్ వచ్చేసిందన్న వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిపుణలు దీనిపై క్లారిటీ ఇస్తున్నారు. ధర్డ్ వేవ్ ప్రభావం భారత్ పై పడుతుందా లేదా అనేది చెప్పడానికి వచ్చే రెండు వారాలు కీలకంగా మారబోతున్నాయని వెల్లడించారు.

కోవిడ్ 19 ధర్డ్ వేవ్

కోవిడ్ 19 ధర్డ్ వేవ్


భారత్ పై కరోనా ధర్డ్ వేవ్ విజృంభిస్తోందా, వరుసగా పెరుగుతున్న కరోనా కేసులు ధర్డ్ వేవ్ కు సూచికగా మారబోతున్నాయా అంటే అవునని కొందరు, కాదని కొందరు విశ్లేషిస్తున్నారు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ధర్డ్ వేవ్ వచ్చేసినట్లేనని కొందరు విశ్లేషిస్తుండగా.. మరికొందరు మాత్రం అప్పుడే ధర్డ్ వేవ్ వచ్చినట్లు కాదంటున్నారు. కేంద్రం కూడా అధికారికంగా ధర్డ్ వేవ్ వచ్చిందని ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ధర్డ్ వేవ్ కు పరిస్ధితులు దారి తీయకుండా తాము గతంలో విడుదల చేసిన మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలని మాత్రమే రాష్ట్రాల్ని కోరుతోంది.

 వచ్చే రెండు వారాలే కీలకం

వచ్చే రెండు వారాలే కీలకం

ఓవైపు కరోనా వైరస్ కేసులు, మరోవైపు ఓమిక్రాన్ వైరస్ కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో కచ్చితంగా వచ్చే రెండు వారాలు కీలకంగా మారనున్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్ధకు చెందిన ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. ప్రస్తుతం కోవిడ్, ఓమిక్రాన్ తో పోరాడుతున్న భారత్.. ధర్డ్ వేవ్ ముప్పు బారిన పడిందా లేదా తెలియాలంటే రాబోయే రెండు వారాల్లో తీసుకోబోయే చర్యలు కీలకంగా మారబోతున్ననట్లు సౌమ్య వెల్లడించారు. దీంతో ఈ రెండు వారాల్లో ప్రభుత్వాల పాత్ర నిర్ణయాత్మకంగా మారిపోయింది.

 ఓమిక్రాన్ సాధారణ జలుబు కాదన్న డబ్ల్యూహెచ్వో

ఓమిక్రాన్ సాధారణ జలుబు కాదన్న డబ్ల్యూహెచ్వో

అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్ధకు చెందిన ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ తాజాగా ఓ ట్వీట్ కూడా చేసారు. ఇందులో
"ఓమిక్రాన్ సాధారణ జలుబు కాదు. ఆరోగ్య వ్యవస్థలు నిష్ఫలంగా ఉండవచ్చు. పెద్ద సంఖ్యలో రోగులను పరీక్షించడానికి, సలహా ఇవ్వడానికి, పర్యవేక్షించడానికి వ్యవస్థలను కలిగి ఉండటం ముఖ్యం. ఎందుకంటే కరోనా కేసుల పెరుగుదల ఆకస్మికంగా, భారీగా ఉంటుందని ఆమె విశ్లేషించారు.

జనవరి చివర్లో పీక్

జనవరి చివర్లో పీక్


భారత్ లో తాజాగా 54 వేల కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ది ఎకనామిక్ టైమ్స్‌తో మాట్లాడుతూ, సీనియర్ ఎపిడెమియాలజిస్ట్ గిరిధర బాబు మాట్లాడుతూ... తాజా అంచనాల ప్రచారం జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారం మధ్య కాలంలో కరోనా కేసులు గరిష్ట స్థాయిని చేరే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. అయితే భారత్ దీన్ని ఎదుర్కొనేందుకు డెల్టా వేరియంట్ వచ్చిన సమయంతో పోలిస్తే ఇప్పుడు సర్వసన్నద్ధంగా ఉందన్నారు. తద్వారా కేసులు పతాకస్ధాయికి చేరినా భారత్ దాన్ని ఎదుర్కోవడం ఖాయమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+