శిబిరంలోకి వెళ్లి...: టెర్రరిస్ట్‌లపై తెలుగు అధికారి తెగువ

NHPC's top executive rescued 50 days after abduction
డిస్‌పూర్/హైదరాబాద్: బోడో తీవ్రవాదుల పైన తెలుగు ఐపిఎస్ సాహసోపేతంగా తలపడి వారి ఆదీనంలో ఉన్న ఎన్‌హెచ్‌పిసి అధికారిని విడిపించారు. దాదాపు రెండు నెలల క్రితం బోడో తీవ్రవాదులు నేషనల్ హైడ్రాలిక్ పవర్ కార్పోరేషన్ (ఎన్‌హెచ్‌పిసి) జనరల్ మేనేజర్ అనిల్ కుమార్ అగర్వాల్‌ను ఎత్తుకెళ్లారు. ఆయనను విడిపించే బాధ్యతను అక్కడ పని చేస్తున్న మన రాష్ట్రంలోని కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన ఐపిఎస్ అధికారి విజయ కృష్ణకు అప్పగించారు.

అస్సోంలో బోడో తీవ్రవాదుల చెరలో 50 రోజులుగా నున్న అనిల్ కుమార్ అగర్వాల్‌ను సురక్షితంగా కాపాడారు. అనిల్ కుమార్ అగర్వాల్‌ను సెప్టెంబర్ 21వ తేదీన నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ సంజిత్ వర్గానికి చెందిన బోడో తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. అతన్ని విడుదల చేసేందుకు వారు ఆ కంపెనీని రూ.20 కోట్ల వరకు డిమాండ్ చేశారు. ఆ అధికారిని బోడోల చెర నుండి విడిపించడానికి అక్కడి ప్రభుత్వం చెయ్యని ప్రయత్నం లేదు.

చివరకు ఆ రాష్ట్రంలో నార్త్ రీజియన్ డిఐజి రామిశెట్టి విజయ కృష్ణకు కొద్దిరోజుల క్రితం ఈ బాధ్యతను అప్పగించారు. విజయ కృష్ణ ఈ కిడ్నాప్‌ను ఓ సవాల్‌గా తీసుకొని ప్రత్యేక వ్యూహంతో సనత్‌పూర్ జిల్లా బైదూర్ అడవుల్లో ఆ ముఠా ఆచూకీ తెల్సుకుని అగర్వాల్‌ను సురక్షితంగా సోమవారం రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో విడిపించగలిగారు. విజయ కృష్ణ స్వయంగా బోడో మిలిటెంట్ల శిబిరంలోకి ప్రవేశించారు.

అక్కడకు వెళ్లేందుకు విజయ కృష్ణ పెద్ద పథకమే రచించారు. దానిని అమలు చేశారు. కిడ్నాప్‌కు పాల్పడ్డ తీవ్రవాదులతో సంబంధమున్న వారిని తమ వైపుకు తిప్పుకొని, ప్రణాళిక ప్రకారం కొందరిని తీవ్రవాదులు ఉండే ప్రాంతానికి పంపించారు. తర్వాత వారి ద్వారానే విజయ కృష్ణ ఆపరేషన్‌లోకి స్వయంగా ప్రవేశించారు. వారితో కలిసిపోయినట్లు నటించారు. కాలకృత్యాలు తీర్చుకుంటున్నట్లు నమ్మించి అనిల్ అగర్వాల్‌ను బయటకు తెచ్చారు.

ఈ సమయంలో అక్కడే సిద్ధంగా ఉన్న భద్రతా దళాలు తీవ్రవాదుల పైకి కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది బోడో తీవ్రవాదులు చనిపోయారు. ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ ఆపరేషన్ పైన అస్సోంలో సర్వత్రా హర్షాతిరేకం వ్యక్తమైంది. తిరువూరుకు చెందిన విజయ కృష్ణ విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాలలో డిగ్రీ చదువుతూ పోలీసు ఉన్నతాధికారి కావాలనే లక్ష్యంతో ప్రత్యేక శిక్షణ పొంది ఐపిఎస్‌కు సెలెక్ట్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+