ఐదుగురు కార్యకర్తల అరెస్ట్: మహారాష్ట్ర, డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఐదుగురు సామాజిక కార్యకర్తల అరెస్టులను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్.. మహారాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ఐదుగురు కార్యకర్తల అరెస్ట్ వ్యవహారంలో వ్యవహారంలో ప్రామాణిక పద్ధతులను అనుసరించలేదని ఆరోపించింది. అంతేగాక, ఇది వారి మానవ హక్కుల ఉల్లంఘనే అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై నాలుగు వారాల్లో వాస్తవిక నివేదిక సమర్పించాలని జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్ఆర్‌సీ) కోరింది.

దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో మానవ హక్కుల కార్యకర్తల అరెస్టులపై నివేదికలను హక్కుల సంఘం పరిశీలించిన తర్వాత నోటీసులు పంపించామని ఎన్‌హెచ్ఆర్‌సీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో పుణె పోలీసులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సామాజిక కార్యకర్తల ఇళ్లపై ఆకస్మిక దాడులు చేసి, అరెస్టులు చేశారు.
విరసం నేత వరవరరావు, అరుణ ఫెరారీ, వెర్నాన్ గోన్ సాల్వేస్, రోనా విల్సన్, న్యాయవాది సురేంద్ర, సుధా భరద్వాజ్, గౌతమ్ నావ్‌లాఖ్ ఇళ్లపై సోదాలు నిర్వహించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో వీరి అరెస్టులకు నిరసనగా దేశ వ్యాప్తంగా వివిధ ప్రజా సంఘాలు నిరసనలు చేపట్టాయి.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications