ఆరుగురు ఉగ్రవాదుల తలలపై రూ. 39 లక్షలు
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ లోని ఉద్ధంపూర్ హైవే మీద జవాన్ల కాన్వాయ్ పై కాల్పులు జరిపి తప్పించుకుని పారిపోయిన ఉగ్రవాదుల తలలకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రూ. లక్షల్లో వెలకట్టారు. ఉగ్రవాదుల ఆచూకి అందిస్తే లక్షలాధి రూపాయలు బహుమానం అందజేస్తామని వెల్లడించారు.
గత నెల 5వ తేదిన ఉదంపూర్ జాతీయ రహదారిపై జవాన్ల మీద ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఆ సందర్బంలో జరిగిన ఎదురు కాల్పులలో పాక్ ఉగ్రవాదితో పాటు ఇద్దరు భారత జవాన్లు మరణించారు. పాకిస్థాన్ కు చెందిన లష్కర్ -ఏ- తోయిబాకు చెందిన మహమ్మద్ నవెద్ యాకూబ్ ను ప్రాణాలతో పట్టుకుని అరెస్టు చేశారు.
నవెద్ ను విచారణ చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఉద్ధంపూర్ హైవేలో బీఎస్ఎఫ్ జవాన్ల కాన్వాయ్ మీద దాడులు చేసిన వారి వివరాలు బయటకులాగారు. ఆ ఉగ్రవాదుల పూర్తి వివరాలు సేకరించారు. పాకిస్థాన్ తో పాటు జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఉగ్రవాదులు భారత్ జవాన్ల మీద కాల్పులు జరిపారని గుర్తించారు.
ఉగ్రవాదులను పట్టించినా, వారి ఆచూకీ చెప్పినా భారీ మొత్తంలో బహుమానం అందిస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ప్రకటించారు. ఉగ్రవాదుల వివరాలు, వారి తలల వెల ఈ విదంగా ఉన్నాయి.

1. అబు దుజనా (లష్కర్ -ఏ- తోయిబా, పాకిస్థాన్) రూ. 8 లక్షలు
2. అదిల్ షేర్ గుజ్రి (లష్కర్- ఏ- తోయిబా, జమ్మూ కాశ్మీర్) రూ. 8 లక్షలు
3. మొయిన్ కచ్రు (హిజబుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది, జమ్మూ కాశ్మీర్) రూ. 8 లక్షలు
4, మాజీద్ జర్గర్ (లష్కర్ -ఏ-తోయిబా, జమ్మూ కాశ్మీర్) రూ. 5 లక్షలు
5. మంజుర్ అహమ్మద్ భట్ ( లష్కర్ -ఏ- తోయిబా, జమ్మూ కాశ్మీర్ ) రూ. 5 లక్షలు
6. ఆషిఖ్ హుస్సేన్ (లష్కర్ -ఏ- తోయిబా, జమ్మూ కాశ్మీర్) రూ. 5 లక్షలు












Click it and Unblock the Notifications