వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పఠాన్ కోట్ ఉగ్రదాడి: ఎస్పీనే దేశ ద్రోహి ?(ఫోటోలు)

|
Google Oneindia TeluguNews

పఠాన్ కోట్: పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి ఘటనలో గురుదాస్ పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్ హస్తం ఉందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీ తీరు పై ఎన్ఐఏ అధికారులు పలు కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.

ఎస్సీ సల్వీందర్ సింగ్, ఆయన స్నేహితుడు నగల వ్యాపారి రాజేశ్ వర్మ, ఎస్పీ వంట మనిషి మదన్ గోపాల్ ను అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యాలని జాతీయ దర్యాప్తు సంస్థ సీనియర్ అధికారులు నిర్ణయించారు.

వీరు ముగ్గురు పొంతనలేని మాటలు చెబుతున్నారని అధికారులు అంటున్నారు. మమ్నల్ని కిడ్నాప్ చేశారని సల్వీందర్ సింగ్ పై అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఒక పోలీసు అధికారి అని తెలిసినా ఉగ్రవాదులు ఎందుకు ఆయనను ప్రాణాలతో వదిలి పెట్టారు అనే అనుమానాలు వస్తున్నాయని ఎన్ఐఏ అధికారులు అంటున్నారు.

అంతరాత్రి ఎందుకు వెళ్లారు

అంతరాత్రి ఎందుకు వెళ్లారు

ఎస్పీ సల్వీందర్ సింగ్ అంత రాత్రిలో కారులో ఎందుకు స్నేహితుడు, వంటమనిషితో కలిసి బయటకు వెళ్లారు అని పూర్తి విచారణ చేస్తున్నామని అధికారులు చెప్పారు.

ప్రాణాలు పోకుండా గొంతు కోశారు

ప్రాణాలు పోకుండా గొంతు కోశారు

ఎస్పీ స్నేహితుడు రాజేష్ వర్మ ప్రాణాలు పోకుండా గొంతు కోయ్యడంపైనా అనుమానాలు ఉన్నాయని పంజాబ్ డీజీపీ సురేష్ అంటున్నారు.

గన్ మ్యాన్ లు వదిలి పెట్టి

గన్ మ్యాన్ లు వదిలి పెట్టి

ఎస్పీ సల్వీందర్ సింగ్ తన గన్ మ్యాన్లను వదిలి పెట్టి స్నేహితుడు, వంట మనిషితో కలిసి వెళ్లారు. తరువాత తమను కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేశారని అధికారులు చెప్పారు.

చేతులకు కట్లు కట్టి రోడ్డు పక్కన వదిలేశారా ?

చేతులకు కట్లు కట్టి రోడ్డు పక్కన వదిలేశారా ?

ఎస్పీ సల్వీందర్ సింగ్, వంట మనిషి మదన్ గోపాల్ కు చిన్న గాయం కాలేదు. మా చేతులు వెనక్కి కట్టేశారని ఎస్పీ అంటున్నారు. అయితే వారి కట్లు ఎలా విప్పుకున్నారు అని అనుమానాలు ఉన్నాయి.

మోసం చేశాడని

మోసం చేశాడని

తాను పోలీసు అధికారి అని తెలిసిన తరువాత కిడ్నాపర్లు వదిలి పెట్టారని, రాజేష్ వర్మ మోసం చేశాడని చెప్పి అతనిని తీసుకు వెళ్లారని ఎస్పీ సల్వీందర్ సింగ్ మీడియాకు చెప్పాడు.

ఎస్పీ మోసం చేశాడని కిడ్నాప్

ఎస్పీ మోసం చేశాడని కిడ్నాప్

ఎస్పీ మమ్నల్ని మోసం చేశారని ఆరోపిస్తూ తమను కిడ్నాప్ చేశారని రాజేష్ వర్మ దర్యాప్తు చేస్తున్న అధికారులకు చెప్పాడు. ఎస్పీ, రాజేష్ వర్మ ఇద్దరూ పొంతన లేని సమాధానాలు చెప్పారు.

అన్ని అనుమానాలే

అన్ని అనుమానాలే

సల్వీందర్ సింగ్, రాజేష్ వర్మ, మదన్ గోపాల్ పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని, వారి మీద మాకు అనుమానాలు ఉన్నాయని ఎన్ఐఏ డీజీపీ శరద్ కుమార్ అంటున్నారు.

ఎస్పీ కారులోనే ఉగ్రవాదులు

ఎస్పీ కారులోనే ఉగ్రవాదులు

సరిహద్దు నుంచి ఎస్పీ కారులోనే దర్జాగా నలుగురు ఉగ్రవాదులు పఠాన్ కోట్ ఎయిర్ బేస్ దగ్గరకు చేరుకున్నారని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దులోని చెక్ పోస్టులో ఎస్పీ కారును సోదా చెయ్యలేదని వెలుగు చూసింది.

ఉగ్రవాదులతో లింక్

ఉగ్రవాదులతో లింక్

పాకిస్థాన్ కు చెందిన జైష్ మహమ్మద్ ఉగ్రవాదులతో సల్వీందర్ సింగ్ కు సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఎంత మంది అని చెప్పలేదు

ఎంత మంది మిమ్మల్ని కిడ్నాప్ చేశారు అని అధికారులు ప్రశ్నిస్తే అందుకు ఎస్పీ సరైన సమాధానం ఇవ్వడం లేదని అంటున్నారు. కిడ్నాప్ చేసింది ఎంత మంది అని ఎస్పీ కచ్చితంగా చెప్పకపోవడంతో ఇంకా అనుమానాలు ఎక్కువ అయ్యాయని ఎన్ఐఏ అధికారులు అంటున్నారు.

English summary
Though superintendent of police Salwinder Singh says the information he provided helped minimise loss of life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X