వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సహచరుల స్థావరాలపై ఎన్ఐఏ దాడులు; టార్గెట్ ఇదే!!

|
Google Oneindia TeluguNews

అంతర్జాతీయ గ్యాంగ్ స్టర్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం భారత్ టార్గెట్ గా చేసిన కుట్రలపై ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సహచరుల స్థావరాలపై, ఆస్తులపై ఎన్ఐఏ దాడులు చేస్తోంది. దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన స్థావరాలు, ఆస్తులపై భారీ అణిచివేతలో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ముంబైలోని 20 ప్రాంతాల్లో పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం సహచరులపై దాడులు నిర్వహిస్తోంది.

దావూద్ ఇబ్రహీం సహచరుల స్థావరాలపై ఎన్ఐఏ దాడులు

దావూద్ ఇబ్రహీం సహచరుల స్థావరాలపై ఎన్ఐఏ దాడులు


దావూద్ ఇబ్రహీం కు సంబంధించిన హవాలా దందాలో, ఉగ్రవాద కార్యాకలాపాలలో భాగంగా ఉన్న అనేక మందిపై సోమవారం తెల్లవారుజాము నుండి దాడులు మొదలు పెట్టింది ఎన్ఐఏ. షార్ప్ షూటర్లు, డ్రగ్స్ ట్రాఫికర్లు, హవాలా ఆపరేటర్లు, దావూద్ ఇబ్రహీంకు చెందిన రియల్ ఎస్టేట్ మేనేజర్లు, క్రిమినల్ సిండికేట్‌లోని ఇతర కీలక వ్యక్తులపై దాడులు కొనసాగుతున్నాయి . బాంద్రా, నాగ్‌పడా, బోరివలి, గోరేగావ్, పరేల్, శాంతాక్రజ్‌లతో పాటు మొత్తం 20 చోట్ల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

డీ కంపెనీ నేరాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎన్ఐఏ

డీ కంపెనీ నేరాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎన్ఐఏ

ఈ ఏడాది ఫిబ్రవరిలో, డి-కంపెనీ నేరాలు, డీ కంపెనీ యొక్క అగ్రనాయకత్వం మరియు దావూద్ అనుచరుల ప్రమేయంపై కేసు నమోదైంది. దావూద్ ఇబ్రహీం కు చెందిన అనుచరులు, సహచరులు చాలా మంది విదేశాల్లో ఉన్నవారు, ఉగ్రవాద కార్యకలాపాలు, వ్యవస్థీకృత నేరాలు మరియు భారతదేశంలో అశాంతిని సృష్టించే లక్ష్యంతో చేసిన చర్యలకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కేసు నమోదు చేసింది. ఎఫ్‌ఐఆర్ లో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ)ను ప్రయోగించింది.

అండర్ వరల్డ్ డాన్ దావూద్ అనుచరులపైనా కొనసాగుతున్న దర్యాప్తు

అండర్ వరల్డ్ డాన్ దావూద్ అనుచరులపైనా కొనసాగుతున్న దర్యాప్తు

డాన్ దావూద్ ఇబ్రహీం నడుపుతున్న అండర్ వరల్డ్ నెట్‌వర్క్ సభ్యులు పాకిస్తాన్‌లోని కరాచీలో నుండి పాల్పడిన నేరాలను, ఉగ్రవాద చర్యల యొక్క మొత్తం స్వరూపాన్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది. ఆల్ఖైదా, లష్కరే తోయిబా వంటి సంస్థలతో దావూద్ ఇబ్రహీం సంబంధాలు పెట్టుకొని భారతదేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నాడు. దావూద్ ఇబ్రహీం మరియు అతని డి-కంపెనీ యొక్క ఆరోపించిన ఉగ్రవాద కార్యకలాపాలపై దర్యాప్తు చేయడంతో పాటు, ఎలైట్ కౌంటర్ టెర్రరిజం యూనిట్ అండర్ వరల్డ్ డాన్ యొక్క అనుచరులు ఛోటా షకీల్, జావేద్ చిక్నా, టైగర్ మీనన్, ఇక్బాల్ మిర్చి, సోదరి హసీనా పార్కర్ పై, హోమ్ అఫైర్స్ మంత్రిత్వశాఖ పై కూడా దర్యాప్తు చేస్తుందని తెలుస్తుంది.

పాకిస్తాన్లోని కరాచీ కేంద్రంగా దావూద్ ఇబ్రహీం అండర్ వరల్డ్ నెట్వర్క్

పాకిస్తాన్లోని కరాచీ కేంద్రంగా దావూద్ ఇబ్రహీం అండర్ వరల్డ్ నెట్వర్క్

ఎన్‌ఐఏ కేసు ఆధారంగా ఇదే కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది .దావూద్ ఇబ్రహీంను 2003లో భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ గ్లోబల్ టెర్రరిస్ట్‌గా గుర్తించాయి. 1993 బాంబే బాంబు పేలుళ్లలో అతనిపై యూఎస్ 25 మిలియన్ల డాలర్ల రివార్డును ప్రకటించింది. ఇటీవలే, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) గ్రే లిస్ట్‌లో చేర్చకుండా తప్పించుకోవడానికి పాకిస్తాన్ ప్రభుత్వం దావూద్ ఇబ్రహీం మరియు 87 మందిని ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలకు అనుమతించింది. ప్రస్తుతం దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోని కరాచీ కేంద్రంగా అండర్ వరల్డ్ నెట్వర్క్ ను నిర్వహిస్తున్నారు.

English summary
The NIA conducts raids on the bases of underworld don Dawood Ibrahim's associates. NIA multiple raids on associates of fugitive gangster Dawood Ibrahim across 20 locations in Mumbai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X