వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దక్షిణాది రాష్ట్రాల్లో మావోయిస్టు శిక్షణా కేంద్రాల కలకలం ; రంగంలోకి ఎన్ఐఏ, ఆ మూడు రాష్ట్రాల్లో సోదాలు!!

|
Google Oneindia TeluguNews

మావోయిస్టులు చాపకింద నీరులా విస్తరిస్తున్నారా? వివిధ రాష్ట్రాల్లో యువతను మావోయిస్టు కార్యకలాపాలలో భాగస్వామ్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారా? ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ చేసిన మావోయిస్టులు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారా? మావోయిస్టు శిక్షణా కేంద్రాల ఏర్పాటు కలకలంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రంగంలోకి దిగిందా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.

AP Power crisis: పరిశ్రమలకూ పవర్ షాక్ .. విద్యుత్ కోత; వెయ్యి మెగావాట్ల సర్దుబాటుకు జగన్ సర్కార్ కసరత్తుAP Power crisis: పరిశ్రమలకూ పవర్ షాక్ .. విద్యుత్ కోత; వెయ్యి మెగావాట్ల సర్దుబాటుకు జగన్ సర్కార్ కసరత్తు

దక్షిణాది రాష్ట్రాలపై మావోయిస్ట్ ల ఫోకస్.. శిక్షణా కేంద్రాల ఏర్పాటు వ్యూహం

దక్షిణాది రాష్ట్రాలపై మావోయిస్ట్ ల ఫోకస్.. శిక్షణా కేంద్రాల ఏర్పాటు వ్యూహం

తమిళనాడు, కర్ణాటక, కేరళ మూడు రాష్ట్రాలలో మావోయిస్టులు తమ స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి, క్యాడర్‌లను నియమించడానికి బాగా ప్రణాళికాబద్ధమైన శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా ఇటీవల అరెస్టయిన మావోయిస్టు నాయకులలో ఒకరు అందించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కి ఇచ్చిన సమాచారంతో కేంద్ర ఏజెన్సీ రంగంలోకి దిగింది.మావోయిస్టులు దక్షిణ భారతదేశంలో తమ ఆయుధ పోరాటాన్ని కొనసాగించడానికి పశ్చిమ కనుమలలో ప్రత్యేక జోనల్ కమిటీని స్థాపించడానికి ప్రయత్నిస్తున్నారని ఇటీవల కొందరు మావోయిస్ట్ నాయకులు పట్టుబడటంతో తెలిసింది.

కూబింగ్ లో పట్టుబడిన మావోయిస్ట్ లు ఇచ్చిన సమాచారం, పలు ఆధారాల సేకరణ

కూబింగ్ లో పట్టుబడిన మావోయిస్ట్ లు ఇచ్చిన సమాచారం, పలు ఆధారాల సేకరణ

మావోయిస్ట్ ల ఏరివేత కోసం తమిళనాడు అటవీ ప్రాంతాలలో పోలీసుల ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కూంబింగ్ ఆపరేషన్ లో కొంత మంది మావోయిస్టు నాయకులను అరెస్టు చేయడంతో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. నీలగిరి, కోయంబత్తూర్, ఈరోడ్, దిండిగల్ మరియు తేని జిల్లాలలో కూంబింగ్ నిర్వహించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. సోదాల సమయంలో నేరపూరిత పత్రాలు, చేతితో రాసిన నోట్లు, ఆయుధ సామాగ్రి మొదలైనవి స్వాధీనం చేసుకున్నట్లు పరిశోధకులు తెలిపారు.

రంగంలోకి దిగిన ఎన్ఐఏ .. తమిళనాడులో 12 చోట్ల, కేరళ, కర్ణాటకలలో 6 చోట్ల సోదాలు

రంగంలోకి దిగిన ఎన్ఐఏ .. తమిళనాడులో 12 చోట్ల, కేరళ, కర్ణాటకలలో 6 చోట్ల సోదాలు

ఇక వీరి ద్వారా సేకరించిన సమాచారంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) మంగళవారం తెల్లవారుజాము నుండి తమిళనాడు, కేరళ మరియు కర్ణాటకలో తనిఖీలను మొదలుపెట్టింది. అనుమానిత మావోయిస్ట్ శిక్షణా కేంద్రాలు, మావోయిస్టులు రహస్య ప్రదేశాలలో సమావేశమవుతున్నారన్న సమాచారంతో ఏకకాలంలో సోదాలు ప్రారంభించింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. తమిళనాడులో గతంలో మావోయిస్టు కార్యకలాపాలు జరిగిన కృష్ణగిరి, సేలం, కోయంబత్తూర్, తేని మరియు శివగంగ జిల్లాలతో సహా 12 చోట్ల సోదాలు జరిగాయి. ఇదే సమయంలో కర్ణాటక మరియు కేరళలోని అర డజను ప్రదేశాలలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు నిర్వహించింది.

యువతను టార్గెట్ చేసుకుని మావోల వ్యూహం .. అందుకే ఎన్ఐఏ తనిఖీలు

యువతను టార్గెట్ చేసుకుని మావోల వ్యూహం .. అందుకే ఎన్ఐఏ తనిఖీలు


మావోయిస్టు భావజాలానికి క్రమపద్ధతిలో బోధించడం ద్వారా తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోని యువతను లక్ష్యంగా చేసుకుని ఒక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఉన్న సమాచారంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో మావోయిస్టుల సాహిత్యం మరియు ప్రచార సామగ్రితో పాటు, పరిశోధకులు కొన్ని శిక్షణ వీడియోలను కూడా గుర్తించారని సమాచారం. ప్రస్తుతం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు దేశవ్యాప్తంగా అనేక కేసులలో దర్యాప్తును సాగిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా అనేక కేసుల్లో కీలకంగా దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ

దేశ వ్యాప్తంగా అనేక కేసుల్లో కీలకంగా దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ

జమ్మూకాశ్మీర్లో సామాన్య పౌరులను హతమారుస్తున్న టెర్రరిస్ట్ అనుబంధ సంస్థల పై 16 చోట్ల దాడులను సాగిస్తున్న ఎన్ఐఏ అధికారులు, మరోవైపు గుజరాత్ ముంద్రా పోర్ట్ హెరాయిన్ కేసులోనూ విచారణ కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో భారతదేశంలో విధ్వంసాలు సృష్టించడం కోసం టెర్రరిస్టులు ప్లాన్ చేశారన్న సమాచారంతో టెర్రరిస్టుల ప్లాన్ ను భగ్నం చేయడానికి ఎన్ఐఏ అధికారులు సోదాలు ప్రారంభించారు. దీనితోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో మావోయిస్టుల శిక్షణ తరగతుల పై ఫోకస్ పెట్టిన ఎన్ఐఏ మావోయిస్టుల ప్లాన్ ను భగ్నం చేయడానికి పని చేస్తోంది.

English summary
NIA conducts raids in Tamil Nadu, Kerala and Karnataka. The search began with information that suspected Maoist training centers and Maoists hideouts. The NIA has entered the fray as the Maoists try to expand in the south.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X