వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నో డౌట్..మళ్లీ లాక్‌డౌన్‌లోకి: ఆ నాలుగు నగరాల్లో నైట్ కర్ఫ్యూ: భయానకంగా కొత్త కేసులు

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. కొద్దిరోజులుగా రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య భయానకంగా పెరుగుతూ వస్తోంది. ఒక్క రోజు వ్యవధిలో వేలల్లో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. మొన్నటిదాకా మహారాష్ట్రకే పరిమితమయ్యాయనుకుంటోన్న కరోనా వైరస్ కొత్త కేసులు.. పొరుగు రాష్ట్రాలకూ విస్తరిస్తున్నాయి. తాజాగా- గుజరాత్‌ కరోనా వైరస్ కొత్త కేసులకు హాట్ స్పాట్‌గా మారింది. ఫలితంగా- లాక్‌డౌన్ తరహా పరిస్థితులు అక్కడ ముసురుకుంటున్నాయి. తొలివిడతగా అన్నట్లు- నాలుగు నగరాల్లో నైట్ కర్ఫ్యూను విధించారు. బుధవారం రాత్రి నుంచి ఇది అమల్లోకి రానుంది.

చంద్రబాబును డెఫినెట్‌గా లోపలేస్తారు: వారిదంతా ఒకటే కులసంఘం: ఖర్జూర రాజ్యాంగం: కొడాలి నానిచంద్రబాబును డెఫినెట్‌గా లోపలేస్తారు: వారిదంతా ఒకటే కులసంఘం: ఖర్జూర రాజ్యాంగం: కొడాలి నాని

 Night Curfew in Ahmedabad, Vadodara, Surat and Rajkot From 10 PM to 6 AM Till March 31

కొద్దిరోజులుగా గుజరాత్‌లో కరోనా వైరస్ కేసుల పెరుగుదల అనూహ్యంగా ఉంటోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతోన్న టీ20 సిరీస్‌ను ప్రత్యక్షంగా తిలకించడంపై నిషేధం విధించారు. నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రేక్షకుల రాకను నిషేధించారు. ఈ సిరీస్‌లో మిగిలిన మూడు మ్యాచులను కూడా ప్రత్యక్షంగా తిలకించడానికి ప్రేక్షకులకు అనుమతి ఇవ్వట్లేదు. వారు కొనుగోలు చేసిన టికెట్ల సొమ్మును రిఫండ్ చేస్తామని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది.

 Night Curfew in Ahmedabad, Vadodara, Surat and Rajkot From 10 PM to 6 AM Till March 31

ఈ పరిణామాల మధ్య నాలుగు ప్రధాన నగరాల్లో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నట్లు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది. గుజరాత్ ఆర్థిక రాజధాని అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్‌లల్లో రాత్రివేళ కర్ఫ్యూను విధించారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు జామున 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఈ నెల 31వ తేదీ వరకు ఇదే పరిస్థితిని కొనసాగించనున్నారు. ఆ తరువాత- కరోనా వైరస్ రోజువారీ కేసుల్లో తగ్గుదల కనిపిస్తే దాన్ని ఎత్తేస్తారు. లేదంటే.. మరింత విస్తరించే అవకాశాలు లేకపోలేదు.

ఇప్పటికే అహ్మదాబాద్‌లోని ఎనిమిది ప్రాంతాల్లో పాక్షికంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. జోధ్‌పూర్, నవ్‌రంగ్ పుర, బోడక్‌దేవ్, థల్‌తేజ్, గోటా, పాల్డీ, ఘట్లోడియా, మణినగర్ వార్డల్లో లాక్‌డౌన్ కొనసాగుతోంది. రోజువారీ కరోనా కేసులు ఏ మాత్రం తగ్గకపోవడంతో నైట్ నగరం వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూను అమల్లోకి తీసుకుని వచ్చారు. ఇదివరకు అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్‌‌లల్లో అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారు జామున 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండేది. కరోనా కేసుల తీవ్రత తగ్గకపోవడంతో సమయాన్ని పొడిగించారు. రాత్రి 10 గంటలకే కర్ఫ్యూ అమల్లోకి వస్తుంది.

English summary
The Gujarat government on Tuesday decided to enforce the night curfew in Ahmedabad, Surat, Vadodara and Rajkot from 10 PM to 6 AM from March 17 till March 31, according to an official statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X