సభలో సాధ్వీ, క్యాబ్ డ్రైవర్ రేప్ దుమారం, రాజ్‌నాథ్ ఇంటి ముందు ధర్నా

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి వ్యాఖ్యల పైన రాజ్యసభలో సోమవారం కూడా దుమారం చెలరేగింది. సాధ్వీ రాజీనామా చేయాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి. సభ ప్రారంభం కాగానే ఆమె రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.

దీనిపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. సాధ్వి ఇప్పటికే క్షమాపణ చెప్పారని, రాద్దాంతం వద్దని విపక్షాలకు సూచించారు. దీనిపై సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. తప్పు చేశానని చెప్పిన వ్యక్తిని శిక్షించాలన్నారు. అధికార పక్షం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని మల్లికార్జున ఖర్గే అన్నారు. విపక్షాలు ఆందోళన చేయడంతో చైర్మన్ సభను వాయిదా వేశారు.

ఢిల్లీ అత్యాచారంపై లోకసభలో రాజ్ నాథ్ ప్రకటన

Niranjan Jyoti row: Logjam in RS ends after Govt agrees to Opposition resolution

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఢిల్లీలో క్యాబ్ డ్రైవర్ అత్యాచారంపై సోమవారం లోకసభలో ప్రకటన చేశారు. అత్యాచారాలు సమాజానికి సిగ్గుచేటు అన్నారు. అత్యాచారానికి పాల్పడిన వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిందితుడిని మధురలో అదుపులోకి తీసుకున్నారని, అతనిని కోర్టు ముందు హాజరు పరుస్తారని చెప్పారు.

రాజ్‌నాథ్ ఇంటిముందు ధర్నా

దేశ రాజధాని న్యూఢిల్లీలో క్యాబ్ డ్రైవర్ మహిళ పైన అత్యాచారం చేసిన ఘటనను నిరసిస్తూ సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు, ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసం ఎదుట ఆందోళన చేపట్టారు. అత్యాచార ఘటనపై నిరసన తెలుపుతూ ప్లకార్డులు పట్టుకొని ఢిల్లీలోని అశోకా రోడ్డులో గల రాజ్ ఇంటి ముందు ధర్నాకు దిగారు.

భద్రతా ఏర్పాటులో కేంద్రం వైఫల్యం చెందుతోందని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని పార్లమెంటు స్ట్రీట్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. రాజధానిలో భద్రత విషయమై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నివాసం ఎదుట కూడా ఆందోళన చేస్తామని ఏఏపీ కార్యకర్తలు తెలిపారు. ఈ ఘటనను పార్లమెంటులో చర్చించాలని ఏఏపీ నేత అశుతోష్ డిమాండ్ చేశారు.

నిందితుడి అరెస్ట్

దేశ రాజధానిలో శనివారం రాత్రి జరిగిన అత్యాచారం కేసులో నిందితుడు శివకుమార్ యాదవ్ (32)ను శనివారం పోలీసులు మధురలో అరెస్టు చేశారు. ఢిల్లీలో శనివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో విధులు ముగించుకుని టాక్సీ ఎక్కిన 27 ఏళ్ల మహిళను శివకుమార్ దారి మళ్లించి నిర్జన ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఢిల్లీ పోలీసులు 12 టీమ్‌లుగా రంగంలోకి దిగారు.

నిందితుడ్ని అప్పగించినా, ఆచూకీ చెప్పినా లక్ష రూపాయల బహుమానం ఇస్తామని ఢిల్లీ పోలీస్ శాఖ ప్రకటించింది. రాజధాని శివార్లలో ఓ చోట పార్క్ చేసి ఉన్న టాక్సీని శనివారం రాత్రే స్వాధీనం చేసుకున్నారు. సెల్‌ఫోన్ ఆధారంగా నిందితుడు మధురలో ఉన్నాడనే విషయాన్ని పసిగట్టిన పోలీసులు వల పన్ని ఆదివారం మధ్యాహ్నం అరెస్టు చేశారు.

కాగా అతను నడుపుతున్న టాక్సీ అమెరికాకు చెందిన ఉబెర్ టాక్సీ సర్వీసుల సంస్థకు చెందినది కావడంతో ఆ సంస్థకు నోటీసులు పంపినట్టు డిల్లీ పోలీసు ప్రతినిధి రజన్ భగత్ చెప్పారు. రాజధానిలో టాక్సీ సర్వీసులు అందించేందుకు రవాణా శాఖ విధించిన నిబంధనలను ఉబెర్ పాటిస్తున్నదో లేదో దర్యాప్తులో తేలుతుందని ఆయన అన్నారు. ఈ టాక్సీకి జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ లేనట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+