వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చివరి అంకం.. నిర్భయ దోషుల క్షమాబిక్ష పిటిషన్

|
Google Oneindia TeluguNews

నిర్భయ కేసులో చివరి అంకం ప్రారంభమైంది. ఉరిశిక్షపై క్షమాబిక్షను కోరుతూ ముగ్గురు నిందితులు క్షమాబిక్ష పిటీషన్లను ధాఖలు చేశారు. నిందితులకు ఇప్పటికే ఉరిశిక్ష ఖారారు అయిన నేపథ్యంలోనే వారికి చట్టప్రకారం ఇవ్వాల్సిన అవకాశాలను సుప్రీం ఇచ్చిన నేపథ్యంలనే వారు నేడు తీహారు జైలులో క్షమాబిక్షకు దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఇప్పటికే నిందితుల్లో ఒకరైన పవన్ కుమార్ పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు వారం రోజుల్లో క్షమాబిక్ష పిటిషన్ పెట్టుకోవాడానికి అవకాశం ఇచ్చింది. దీంతో ముగ్గురు నిందితులు తమ పిటిషన్‌ను నేడు దఖాలు చేశారు. కాగా దీనిపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

మిగిలింది ఉరి..... నిర్భయ నిందితుడి పిటిషన్ కొట్టివేసిన కోర్టు మిగిలింది ఉరి..... నిర్భయ నిందితుడి పిటిషన్ కొట్టివేసిన కోర్టు

కోర్టుకు చేరిన క్షమాబిక్ష పిటిషన్

కోర్టుకు చేరిన క్షమాబిక్ష పిటిషన్

నిర్భయ కేసు నిందితుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌‌ను ఇదివరకే సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉరిశిక్షను పున:సమీక్సించాలన్న నిందితుడి రివ్యూ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అయితే దోషి తరపు న్యాయవాది మాట్లాడుతూ.. రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్‌కు మూడువారాల గడువు ఇవ్వాలని కోరింది. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. మూడువారాలు ఎందుకు.. వారం సరిపోతుందని పేర్కొంది. దీంతో వారంలో రోజుల్లో నిందితులు క్షమాబిక్ష పిటిషన్‌ను వేశారు.

2012 డిశంబర్‌లో నిర్భయ ఘటన

2012 డిశంబర్‌లో నిర్భయ ఘటన

కాగా డిసెంబర్ 16, 2012లో జరిగిన నిర్భయ ఘటనలో మొత్తం ఆరుగురు దోషుల్లో ఒకరు మైనర్ కావడంతో అతనికి 3సంవత్సరాల జైలు శిక్ష విధించగా అతను శిక్ష అనంతరం బయటకు వచ్చాడు.. మిగతా నిందితుల్లో రామ్‌సింగ్ అనే వ్యక్తి జైల్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నలుగురు తిహార్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఉరిశిక్షపై రివ్యూ పిటిషన్‌లో పాటు క్షమాబిక్ష పిటిషన్లు వేస్తుండడంతో విచారణలు కొనసాగుతున్నాయి. దీంతో సుప్రీం కోర్టు విధించిన శిక్ష ఇంకా అమలు కాలేదు. ఈ నేపథ్యంలోనే నిందితులకు చట్టపరంగా దక్కాల్సిన అవకాశాన్ని సుప్రీం కోర్టు కల్పించింది.

క్షమాబిక్షకు వ్యతిరేకంగా రాష్ట్రపతి

క్షమాబిక్షకు వ్యతిరేకంగా రాష్ట్రపతి

కాగా దేశవ్యాప్తంగా మహిళలపై కొనసాగుతున్న అత్యాచారాలపై అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిందితులను విచారణ పేరుతో సంవత్సరాల తరబడి జైలులో ఉంచడం వల్ల .. బాధితులకు సరైన న్యాయం జరగడం లేదని భావిస్తున్నారు. ఈనేపథ్యంలోనే న్యాయస్థానాలు సైతం ప్రత్యేక కోర్టులు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు సైతం ఏర్పాటు చేశారు. కాగా మహిళలు, పిల్లలపై అత్యాచారాలకు గురి చేసిన వారికి క్షమాబిక్ష అనేది అవసరం లేదని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ స్యయంగా పార్లమెంట్‌ను కోరారు. ఇందుకు సంబంధించి చట్టాలు సవరణ కూడ చేయాలని కోరాడు. దీంతో నిర్భయం క్షమాబిక్ష పిటిషన్‌ను తిరస్కరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అనంతరం నిందితులను ఉరితీసేందుకు ఏర్పాట్లు జరగనున్నట్టు సమాచారం .

English summary
Three of the accused have filed seeking mercy plea in Nirbhaya case. The accused have already been executed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X