అన్నాడీఎంకే పార్టీ లేడీ ఫైట్: పన్నీర్ సెల్వం వర్గంలో చేరిన యాంకర్, నటి !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: ప్రముఖ తమిళ టీవీ చానల్ యాంకర్, నటి, అన్నాడీఎంకే పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు నిర్మలా పెరియసామి శశికళ వర్గానికి పెద్ద ఝలక్ ఇచ్చారు. మంగళవారం నిర్మలా పెరియసామి పన్నీర్ సెల్వం వర్గంలో అధికారికంగా చేరిపోయి శశికళ వర్గానికి గట్టి షాక్ ఇచ్చారు.

అన్నాడీఎంకే పార్టీకి చెందిన సీనియర్ మహిళా నాయకురాలైన పా. వలర్మతి, నిర్మలా పెరియసామి మధ్య ఇటీవల జరిగిన ఓ సమావేశంలో చిన్న విషయంలో పెద్ద గొడవ అయ్యింది. నిర్మలా పెరియసామి మంచి వ్యాఖ్యాత, నటి, యాంకర్.

Nirmala Periyasamy will join OPS team on today from Sasikala team.

ఆమె ప్రసంగాలతో ప్రజలను అట్టే ఆకట్టుకుంటారు. అయితే ఆర్ కే నగర్ ఉప ఎన్నికల ప్రచారం చేసే విషయంలో చర్చించడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో వలర్మతి, నిర్మలా పెరియసామిల మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని సమాచారం.

ఇదే సమయంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధి సీఆర్. సరస్వతి సైతం మౌనంగా ఉండిపోయారని తెలిసింది. ఈ విషయంపై కలత చెందిన నిర్మలా పెరియసామి ఇక శశికళ వర్గంలో ఉండటం మంచిది కాదని నిర్ణయించారు.

వెంటనే పన్నీర్ సెల్వం వర్గంతో చర్చించారు. పన్నీర్ సెల్వం వర్గం నిర్మలా పెరియస్వామిని ఆయన వర్గంలోకి ఆహ్వానించారు. మంగళవారం పన్నీర్ సెల్వం సమక్షంలో నిర్మలా పెరియసామి ఆయన వర్గంలో చేరిపోయారు. ఇక శశికళ అండ్ కో మీద నిర్మలా పెరియసామి ఏవిధంగా విమర్శలు చేస్తారో వేచిచూడాలని అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు అంటున్నారు..

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Clash erupt between Nirmala Periyaswamy and Pa.Valarmathi at AIADMK star campaigners meeting.
Please Wait while comments are loading...