Taxpayers: వేతన జీవులకు ఊరటనివ్వని నిర్మలమ్మ పద్దు ! ఈసారి బడ్జెట్లో..
కేంద్ర బడ్జెట్ వస్తుందంటే చాలు వేతన జీవులు ఎంతో కొంత ఊరట లభిస్తుందని భావిస్తారు. అదీ ఎన్నికలకు ముందే ప్రవేశపెట్టే బడ్జెట్ అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈసారి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో అలాంటి ప్రస్తావన లేకుండానే సాగిపోయింది. దీంతో బడ్జెట్ లో పన్నుల ఊరట లభిస్తుందని ఆశించిన సగటు వేతన జీవికి నిరాశ తప్పలేదు.
ఇవాళ పార్లమెంట్ లో 2024-25 ఆర్ధిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ అస్సలు ఉద్యోగుల్ని పట్టించుకోలేదు. వారి గురించిన ప్రస్తావన లేకుండానే ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని హడావిడిగా ముగించేశారు. కేవలం పన్ను విధానంలో ఈసారి ఎలాంటి మార్పుల్లేవని తేల్చిచెప్పేశారు. తద్వారా వేతన జీవులు ఆశించిన ఊరట దక్కకపోగా..ఓ రకంగా ఎన్నికల వేళ వారికి షాక్ తగిలినట్లయింది.

2026 ఆర్ధిక సంవత్సరానికి ద్రవ్య లోటును 4.5 శాతం తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్ధిక మంత్రి నిర్మల తన ప్రసంగంలో తెలిపారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో మార్కెట్ నుంచి తీసుకునే అప్పులు 14.13 లక్షల కోట్లుగా ఆమె అంచనా వేశారు.
Recommended Video

ఈ నేపథ్యంలో పన్ను విధానంలో మార్పులు చేసి వేతన జీవులకు ఊరటనిస్తారని ఆశించడం అత్యాశగా మారింది. కనీసం ఈసారి 80సీ కింద ఇచ్చే మినహాయింపులు పెంచుతారని ఉద్యోగులు భావించారు. అలాగే ఎన్నికల వేళ పన్ను స్లాబ్ లలో మార్పులు చేసి ఐటీ చెల్లించే ఉద్యోగులకు ఊరటనిస్తారని ఆశించినా అలా జరగలేదు. దీంతో ఉద్యోగులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.












Click it and Unblock the Notifications