చైనా సైనికులకు నిర్మల సీతారామన్‌ పాఠాలు!

చైనా సైనికులకు భారత రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ పాఠాలు చెప్పారు. ‘నమస్కారం’ అర్థాన్ని ఆమె వారికి వివరించారు. సిక్కిం నాథూలా ప్రాంతంలోని భారత్-చైనా సరిహద్దు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

న్యూఢిల్లీ: చైనా సైనికులకు భారత రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ పాఠాలు చెప్పారు. 'నమస్కారం' అర్థాన్ని ఆమె వారికి వివరించారు. సిక్కిం నాథూలా ప్రాంతంలోని భారత్-చైనా సరిహద్దు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ ఆదివారం భారత్-చైనా సరిహద్దును సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడి చైనా సైనికులను కూడా కలిశారు. చైనా సైనికాధికారి తమ సహచరులకు ఆమెను పరిచయం చేసినప్పుడు.. ఆమె రెండు చేతులు జోడించి 'నమస్కారం' చేశారు.

ఆ సమయంలో ఆమె 'మీకు నమస్కారం అర్థం తెలుసా?' అని చైనా సైనికులను ప్రశ్నించారు. అంతలో భారత సైనికులు నమస్కారం అర్థాన్ని చైనా సైనికులకు వివరించబోగా ఆమె వారిని వారించి తనే స్వయంగా ఆ అర్థాన్ని వివరించారు.

Nirmala Sitharaman teaching Namaste to Chinese soldiers at Nathu-la

చైనా సైనికాధికారి నమస్కారానికి ''మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషం..'' అనే అర్థమై ఉంటుందని తెలిపారు. అంతేకాదు, నమస్కారానికి చైనీయుల భాషలో ఎలా స్పందించాలని కూడా సీతారామన్ వారిని అడిగి తెలుసుకున్నారు.

సదరు అధికారి నమస్కారానికి తమ భాషలో 'ని హావ్' అనాలని బదులివ్వగా.. ఆ అధికారి ఆంగ్ల భాష నైపుణ్యాన్ని నిర్మల సీతారామన్ మెచ్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+