నిఠారి హత్యలు: ఇద్దరు దోషులకు మరణశిక్ష
ఘజియాబాద్: నిఠారీ వరుస హత్యల కేసులో వ్యాపారవేత్త మోనీందర్ సింగ్ పందేర్, అతడి పనిమనిషి సురేందర్ కోలీకి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష విధించింది. 25 ఏళ్ల ఓ యువతిని అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ఈ తీర్పు వెలువరించింది.

మొత్తం 16 కేసుల్లో కోలీ దోషిగా తేలగా.. అందులో ఇది తొమ్మిదోది. పందేర్, కోలీ కలిసి దోషులుగా నిర్ధారణ అయిన మూడో కేసు ఇది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నొయిడాలో నిఠారీ వరుస హత్యలు సంచలనం సృష్టించాయి.
16 మందిని హత్య చేసి పందేర్ ఇంటి వెనక భాగంలో పూడ్చిపెట్టారు. హత్యకు గురైన వారిలో చాలా వరకు పిల్లలు ఉండటం గమనార్హం. ఇంటి వెనుక భాగంలో పెద్దఎత్తున అస్తిపంజరాలు వెలుగుచూడడంతో నిఠారీ వరుస హత్యలుగా ఈ కేసు మారింది.












Click it and Unblock the Notifications