నిత్యానంద బ్రతికే ఉన్నారు... కైలాస దేశం సంచలన ప్రకటన

వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త స్వామి నిత్యానంద కైలాస దేశం పేరుతో ఒక కొత్త దేశాన్ని ఏర్పాటు చేసుకొని ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. నిత్యానంద ఏర్పాటు చేసిన కైలాస దేశం ఎక్కడ ఉంది అనేది ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. ఇక అటువంటి నిత్యానంద స్వామికి సంబంధించిన ఒక వార్త తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.

నిత్యానంద మరణ వార్తలపై సంచలన ప్రకటన
నిత్యానంద మేనల్లుడు సుందరేశ్వరన్ నిత్యానంద మృతి చెందినట్టు మీడియాకు సమాచారం పంపించినట్లు సమాచారం. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ఆయన తన ప్రాణాలను త్యాగం చేసినట్టు చెబుతున్నట్టు కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఈ క్రమంలో తాజాగా కైలాస దేశం నుండి నిత్యానంద మరణ వార్తల పైన సంచలన ప్రకటన వెలువడింది.

Nithyananda swami is alive Kailasa Desam sensational statement

నిత్యానంద సురక్షితంగా, బ్రతికే ఉన్నారు
నిత్యానంద నిజంగానే మరణించారని చాలామంది సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో కైలాస దేశం నుంచి తాజాగా ఒక సంచలన ప్రకటన విడుదలైంది. ఆ ప్రకటనలో నిత్యానంద ఆరోగ్యంగా, సురక్షితంగా, జీవించి, చురుగ్గా ఉన్నారని పేర్కొన్నారు. కొంతమంది దురుద్దేశ పూర్వకంగా స్వామి నిత్యానంద మరణించారన్న వార్తలను ప్రచారం చేస్తున్నారని మీడియా ప్రచారం చేస్తున్న వార్తలను కైలాస దేశం ఖండిస్తోంది అని తెలిపారు.

నిత్యానంద మరణ వార్త పుకారు ,మాత్రమే
నిత్యానంద ఆరోగ్యంగా ఉన్నారని మార్చి 30 తేదీన ఉగాది ఉత్సవాలలో కూడా ఆయన పాల్గొన్నారని పేర్కొన్నారు. ఇక తమ వాదనను రుజువు చేయడం కోసం ఒక లైవ్ స్ట్రీమ్ లింకును కూడా జత చేశారు. నిత్యానంద ఆరోగ్యంగానే బ్రతికి ఉన్నాడని చెబుతున్న వారు ప్రస్తుతం నిత్యానంద ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఏది ఏమైనప్పటికీ నిత్యానంద మరణ వార్త కేవలం పుకారు మాత్రమేనని తాజా పరిణామాలతో అర్థమవుతుంది.

సొంత దేశం ఏర్పాటు చేసుకున్న నిత్యానంద
భారతదేశంలో నిత్యానంద స్వామి పైన ఎన్నో కేసులు ఉన్నాయి. బలత్కారం, అపహరణ ఆరోపణలను ఎదుర్కొన్న నిత్యానంద స్వామి 2019లో భారతదేశం నుంచి పరారయ్యారు. ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అనే ఒక స్వతంత్ర హిందూ రాష్ట్రాన్ని స్థాపించినట్టు ఆయన ప్రకటించారు.

కైలాస దేశానికి ఎవరూ వెళ్ళలేదు
ఈ దేశం ఎక్వడార్ సమీపంలో ఒక ద్వీపంలో ఉన్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ ఇప్పటివరకు అక్కడకు బయట నుంచి ఎవరు వెళ్లిన దాఖలాలు లేవు. సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకుని ఏలుతున్న నిత్యానంద పైన తాజా వార్తల నేపథ్యంలో ఒక్కసారిగా మళ్ళీ నిత్యానంద స్వామిని అందరూ గుర్తు చేసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+