చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Nithyananda: నిత్యానందస్వామిజీకి షాక్, రేప్ కేసులో నాన్ బెయిల్ బుల్ వారెంట్, ఇప్పటికే బ్లూకార్నర్ నోటీసు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ రామనగర/ చెన్నై: నేను దేవమానవుడు అంటూ చంకలు గుద్దుకుని అత్యాచారం కేసులో అరెస్టు అయ్యి జైలు జీవితం గడిపి బెయిల్ మీద బయటకు వచ్చి చివరికి దేశం వదలిపారిపోయిన నిత్యానంద అలియాస్ నిత్యానంద స్వామికి విరుద్దంగా నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ అయ్యింది. మహిళ మీద అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద మీద ఇప్పటికే కేసు నమోదు అయ్యింది. కొన్ని సంవత్సరాల పాటు కోర్టు విచారణకు హాజరైన నిత్యానంద మూడు సంవత్సరాల క్రితం భారతదేశం వదలేసి విదేశాలకు పారిపోయాడు. ఇప్పటికే నిత్యానందకు వ్యతిరేకంగా బ్లూ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పుడు నిత్యానందకు నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ కావడంతో ఆన శిష్యులు హడలిపోయారు.

Illegal affair: భర్త సక్రమంగా సంసారం చెయ్యలేదని ప్రియుడితో తల్లి అయిన భార్య, కుప్పం భర్త ఏం చేశాడంటే !Illegal affair: భర్త సక్రమంగా సంసారం చెయ్యలేదని ప్రియుడితో తల్లి అయిన భార్య, కుప్పం భర్త ఏం చేశాడంటే !

నేను దేవమానవుడు..... ఆశీర్వాదం తీసుకోండి

నేను దేవమానవుడు..... ఆశీర్వాదం తీసుకోండి

బెంగళూరు నగరం శివార్లలోని బిడిదిలో నిత్యానంద అలియాస్ నిత్యానంద స్వామి ఆశ్రయం ఉంది. నేను దేవమానవుడు అంటూ గొప్పలు చెప్పుకున్న నిత్యానంద దేశ విదేశాల్లో భారీ సంఖ్యలు భక్తులను ఆకర్షించాడు. బిడిదితో పాటు తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో నిత్యానంద ఆశ్రమాలు పెట్టి ఆయన ఆశ్రయాలకు వచ్చి వెలుతున్న భక్తులకు హితోపదేశం చేశారు.

నిత్యానంద మీద అత్యాచారం కేసు

నిత్యానంద మీద అత్యాచారం కేసు

బిడది ఆశ్రమంలో తన మీద నిత్యానందస్వామి అత్యాచారం చేశారని ఆయన ఆశ్రమంలో ఉంటున్న ఓ వివాహిత మహిళ 2010లో బిడది పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిత్యానందతో పాటు ఆయన శిష్యులు కొందరిని అరెస్టు చేసి రామనగర జైలుకు పంపించారు. కొంతకాలం పాటు నిత్యానంద జైలు జీవితం గడిపారు.

 బెయిల్ మీద బయటకు వచ్చిన నిత్యానంద

బెయిల్ మీద బయటకు వచ్చిన నిత్యానంద


జైలు జీవితం గడిపిన నిత్యానందకు బెయిల్ మంజూరు కావడంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. బెయిల్ మీద బయటకు వచ్చిన నిత్యానంద తరువాత అత్యాచారం కేసు విచారణకు హాజరైనారు. 2019 వరకు కోర్టు విచారణకు హాజరైన నిత్యానంద తరువాత తనకు ప్రాణహాని ఉందని, తనను చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారని ఆరోపించారు.

 నిత్యానంద స్వామిజీ జంప్ జిలాని

నిత్యానంద స్వామిజీ జంప్ జిలాని


2019 వరకు భక్తుల ముందు ప్రత్యక్షం అయిన నిత్యానంద అదే సంవత్సరం సీక్రేట్ గా భారతదేశం వదిలి విదేశాలకు పారిపోయాడు. కైలాసం అనే దేశాన్ని సొంతంగా స్థాపించుకున్న నిత్యానంద కైలాసం దేశానికి నేనే రాజు నేనే మంత్రి అంటూ చలామణి అవుతున్నాడు. నిత్యానంద కోసం కర్ణాటక, గుజరాత్ పోలీసులు గాలిస్తున్నారు.

నిన్న బ్లూ కార్నర్ నోటీసు..... ఇప్పుడు నాన్ బెయిల్ బుల్ వారెంట్

నిన్న బ్లూ కార్నర్ నోటీసు..... ఇప్పుడు నాన్ బెయిల్ బుల్ వారెంట్

దేశం వదిలిపారిపోయిన నిత్యానందకు వ్యతిరేకంగా ఇప్పటికే బ్లూ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. నేను దేవమానవుడు అంటూ చంకలు గుద్దుకుని అత్యాచారం కేసులో అరెస్టు అయ్యి జైలు జీవితం గడిపి బెయిల్ మీద బయటకు వచ్చి దేశం వదలిపారిపోయిన నిత్యానంద అలియాస్ నిత్యానంద స్వామికి విరుద్దంగా నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ అయ్యింది.

బెయిల్ కు షూరిటీ ఇచ్చిన వ్యక్తికి నోటీసులు.... తప్పని తిప్పలు

బెయిల్ కు షూరిటీ ఇచ్చిన వ్యక్తికి నోటీసులు.... తప్పని తిప్పలు


రామనగర 3వ అడిషినల్ జిల్లా న్యాయస్థానం, స్సెషల్ కోర్టులో జరుగుతున్న కేసుల విచారణకు నిత్యానంద హాజరుకాకపోవడంతో నాన్ బెయిల్ బుల్ వారెంట్లు జారీ అయ్యాయి. నిత్యానంద బెయిల్ కు షూరిటీ ఇచ్చిన వ్యక్తికి కోర్టు నోటీసులు జారీ చేసింది. నిత్యానంద కోర్టుకు హాజరుకాకపోతే షూరిటీ ఇచ్చిన వ్యక్తి ఆస్తిని జప్తు చేసే అవకాశం ఉందని న్యాయవాది అంటున్నారు. మొత్తం మీద నిత్యానందకు నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ కావడంతో ఆయన మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.

English summary
Nithyananda Swami: Non bailable warrant issued against self proclaimed god Nithyananda Swami in Ramanagar in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X