వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీతి ఆయోగ్: సీఎంలతో చంద్రబాబు, వెంకయ్య, జైట్లీలే సాక్ష్యం(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆయన నివాసంలో ఆదివారం నీతీ ఆయోగ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న తర్వాత ఉమ్మడి భవన్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విలేకరులతో మాట్లాడారు.

‘‘రాష్ట్ర విభజనను ఏపీ ప్రజలు కోరుకోలేదు. రాజకీయ కారణాలతోనే రాష్ట్రాన్ని విభజించారు. విభజన సమయంలో ఏపీకి కొన్ని హామీలిచ్చారు. అవి కూడా అన్యాయమేనని కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్య నాయుడు, అరుణ్‌ జైట్లీ కూడా రాజ్యసభలో హామీలిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వాటిని అమలు చేయాలనే ఇప్పుడు మేం కోరుతున్నామని, ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు నిలబెట్టుకోవాలి'' అని చంద్రబాబు స్పష్టం చేశారు.

గతంలో ప్రధానిని కలిసి ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.24,350 కోట్లు అడిగామని, అందులో రూ.350 కోట్లు మాత్రమే ఇచ్చారని చెప్పారు. తాము ఇబ్బందుల్లో ఉన్నామని, ఏడు నెలల్లో రాష్ట్రానికి వచ్చిన ఆదాయాన్ని కూడా వివరించానని అన్నారు. ‘రాష్ట్ర విభజన చట్టాన్ని చేసే సమయంలోనే, ఏపీకి జరిగే నష్టాన్ని పూడుస్తామని, రీయింబర్స్‌ చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక ‘‘బడ్జెట్‌లో లోటు ఉండటంతో కేంద్రానికి కూడా ఇబ్బందులు ఉండవచ్చు. వివిధ కారణాలు, అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడంతో అది కొంత మెరుగుపడింది. ఇటీవల దాదాపు రూ.45 వేల కోట్ల వరకూ కేంద్రానికి ఆదాయం వచ్చింది. ఇతర శాఖలు, రాష్ట్రాల మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌ను చూడకూడదని చెప్పారు.

‘నీతి ఆయోగ్‌' గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలుత మాట్లాడారు. కేంద్రంనుంచి రాష్ట్రాలకు నిధులు వస్తాయని, ఫ్లాగ్‌షిప్‌ పథకాల విధివిధానాలు సరళంగా ఉండాలని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం డిమాండ్‌ చేశారు.

 నీతి ఆయోగ్: సీఎంలతో చంద్రబాబు

నీతి ఆయోగ్: సీఎంలతో చంద్రబాబు

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆయన నివాసంలో ఆదివారం జరిగిన నీతీ ఆయోగ్ సమావేశంలో వైస్ ఛైర్మన్‌తో అరవింద్ పనగడియా మాట్లాడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు.

 నీతి ఆయోగ్: సీఎంలతో చంద్రబాబు

నీతి ఆయోగ్: సీఎంలతో చంద్రబాబు

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆయన నివాసంలో ఆదివారం నీతీ ఆయోగ్ సమావేశం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ నమస్కరిస్తుంటే చూస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు.

నీతి ఆయోగ్: సీఎంలతో చంద్రబాబు

నీతి ఆయోగ్: సీఎంలతో చంద్రబాబు

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆయన నివాసంలో ఆదివారం నీతీ ఆయోగ్ సమావేశం జరిగింది. గుజరాత్, రాజస్ధాన్ ముఖ్యమంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబు.

 నీతి ఆయోగ్: సీఎంలతో చంద్రబాబు

నీతి ఆయోగ్: సీఎంలతో చంద్రబాబు

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆయన నివాసంలో ఆదివారం నీతీ ఆయోగ్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో దేశంలో అన్ని రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

 ప్రధాని మోడీ నివాసంలో నీతి ఆయోగ్ సమావేశం

ప్రధాని మోడీ నివాసంలో నీతి ఆయోగ్ సమావేశం

‘నీతి ఆయోగ్‌' గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలుత మాట్లాడారు. కేంద్రంనుంచి రాష్ట్రాలకు నిధులు వస్తాయని, ఫ్లాగ్‌షిప్‌ పథకాల విధివిధానాలు సరళంగా ఉండాలని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం డిమాండ్‌ చేశారు.

 ప్రధాని మోడీ నివాసంలో నీతి ఆయోగ్ సమావేశం

ప్రధాని మోడీ నివాసంలో నీతి ఆయోగ్ సమావేశం

ఇక, కేంద్ర పథకాలకు సంబంధించి 90 శాతం నిధులను గ్రాంట్లుగా ఇవ్వాలని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ సింగ్‌ యాదవ్‌ కోరారు.

 ప్రధాని మోడీ నివాసంలో నీతి ఆయోగ్ సమావేశం

ప్రధాని మోడీ నివాసంలో నీతి ఆయోగ్ సమావేశం

కఠిన నిబంధనల కారణంగా ఈ పథకాల నుంచి రాష్ట్రాలు ఎటువంటి లబ్ధి పొందలేకపోతున్నాయని వివరించారు. అనంతరం ప్రధాన మంత్రి మోడీ మాట్లాడారు.

 ప్రధాని మోడీ నివాసంలో నీతి ఆయోగ్ సమావేశం

ప్రధాని మోడీ నివాసంలో నీతి ఆయోగ్ సమావేశం

అన్ని పథకాలకూ ఒకే తరహాలో నిధులు మంజూరు చేసే విధానానికి స్వస్తి పలకాలని, రాష్ట్రాల అవసరాలను బట్టి పథకాలను అమలు చేయాలని స్పష్టం చేశారు.

 ప్రధాని మోడీ నివాసంలో నీతి ఆయోగ్ సమావేశం

ప్రధాని మోడీ నివాసంలో నీతి ఆయోగ్ సమావేశం

రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ‘‘66 కేంద్ర పథకాలనూ అధ్యయనం చేయండి. వాటిలో వేటిని కొనసాగిద్దాం. వేటిని రాష్ట్రాలకు బదిలీ చేద్దాం. వేటిని రద్దు చేద్దాం అని సిఫారసు చేయండి'' అని మోడీ స్పష్టం చేశారు.

 ప్రధాని మోడీ నివాసంలో నీతి ఆయోగ్ సమావేశం

ప్రధాని మోడీ నివాసంలో నీతి ఆయోగ్ సమావేశం

కేంద్ర ప్రభుత్వం పగ్గాలు చేపట్టి కొద్ది నెలలే అయ్యిందని, కేంద్ర ఆదాయం కూడా తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ నేపథ్యంలో తగిన సమయంలో నెమ్మదిగా హామీల అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.

 ప్రధాని మోడీ నివాసంలో నీతి ఆయోగ్ సమావేశం

ప్రధాని మోడీ నివాసంలో నీతి ఆయోగ్ సమావేశం

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆయన నివాసంలో ఆదివారం నీతీ ఆయోగ్ సమావేశం జరిగింది. ఈ సమావేశ అనంతరం ప్రధాని మోడీతో ఫోటోలకు ఫోజులిచ్చిన ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు.

 ప్రధాని మోడీ నివాసంలో నీతి ఆయోగ్ సమావేశం

ప్రధాని మోడీ నివాసంలో నీతి ఆయోగ్ సమావేశం

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ మాట్లాడుతూ రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిగా అమలు చేస్తామని, వీలైతే అంతకంటే ఎక్కువ కూడా చేయాలని కేంద్రం భావిస్తోందని స్పష్టం చేశారు.

ఇక, కేంద్ర పథకాలకు సంబంధించి 90 శాతం నిధులను గ్రాంట్లుగా ఇవ్వాలని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ సింగ్‌ యాదవ్‌ కోరారు. కఠిన నిబంధనల కారణంగా ఈ పథకాల నుంచి రాష్ట్రాలు ఎటువంటి లబ్ధి పొందలేకపోతున్నాయని వివరించారు. అనంతరం ప్రధాన మంత్రి మోడీ మాట్లాడారు. అన్ని పథకాలకూ ఒకే తరహాలో నిధులు మంజూరు చేసే విధానానికి స్వస్తి పలకాలని, రాష్ట్రాల అవసరాలను బట్టి పథకాలను అమలు చేయాలని స్పష్టం చేశారు.

రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ‘‘66 కేంద్ర పథకాలనూ అధ్యయనం చేయండి. వాటిలో వేటిని కొనసాగిద్దాం. వేటిని రాష్ట్రాలకు బదిలీ చేద్దాం. వేటిని రద్దు చేద్దాం అని సిఫారసు చేయండి'' అని మోడీ స్పష్టం చేశారు.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ మాట్లాడుతూ రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిగా అమలు చేస్తామని, వీలైతే అంతకంటే ఎక్కువ కూడా చేయాలని కేంద్రం భావిస్తోందని స్పష్టం చేశారు. గతవారం తాము కొన్ని రాయితీలను ప్రకటించామని, ఇది హామీల అమలు ప్రక్రియకు ఆరంభం మాత్రమేనని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం పగ్గాలు చేపట్టి కొద్ది నెలలే అయ్యిందని, కేంద్ర ఆదాయం కూడా తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ నేపథ్యంలో తగిన సమయంలో నెమ్మదిగా హామీల అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.

English summary
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu on Sunday sought special status category for the state besides an increase in central assistance, saying that it has suffered immensely after its bifurcation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X