నీతి ఆయోగ్ ఎస్‌డీజీ ఇండియా ఇండెక్స్- వాతావరణ పరిరక్షణలో ఒడిశా టాప్
ఐక్యరాజ్యసమితితో కలిసి పర్యావరణం, అభివృద్ధి, ఆర్ధిక రంగాల్లో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఏటా ప్రకటిస్తున్న ర్యాంకుల్లో ఈసారి వెనుకబడిన రాష్ట్రం ఒడిశా సత్తా చాటుకుంది. వాతావరణ విభాగంలో నిర్దేశిత లక్ష్యాల్ని అందుకున్న ఒడిశాకు గోల్ -13 వాతావరణ పరిరక్షణ అంశంలో టాప్ ర్యాంకు దక్కింది.
నీతి ఆయోగ్ సమీకృతాభివృద్ధి లక్ష్యాల సూచికలోని వాతావరణ పరిరక్షణ విభాగంలో ఒడిశా అగ్రస్ధానంలో నిలిచింది. ఒడిశా మొత్తం మీద 70 పాయింట్లతో టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఒడిశా తర్వాత స్ధానంలో 69 పాయింట్లతో కేరళ, నాగాలాండ్, 67 పాయింట్లతో గుజరాత్, 66 పాయింట్లతో మిజోరం, 65 పాయింట్లతో సిక్కిం ఉన్నాయి. నీతి ఆయోగ్ సమీకృతాభివృద్ధి లక్ష్యాల సూచీ (ఎస్‌డీజీ)లో రాష్ట్రాలకు 16 నుంచి 70 పాయింట్లు, కేంద్రపాలిత ప్రాంతాలకు 18 నుంచి 77 పాయింట్లు కేటాయిస్తున్నారు. ఇందులో ఒడిశా రాష్ట్రాల జాబితాలోనూ, అండమాన్ నికోబార్ దీవులు కేంద్రపాలిత ప్రాంతాల లిస్ట్‌లోనూ టాప్‌లో నిలిచాయి.

వాతావరణ మార్పుల కారణంగా ఆయా రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో కోటి మంది జనాభాలో ఎంతమంది చనిపోయారు, విపత్తులను ఎదుర్కొనే సామర్ధ్యం, మొత్తం అందుబాటులో ఉన్న విద్యుత్‌లో సంప్రదాయేతర విద్యుత్ వాటా ఎంత, ఎల్‌ఈడీ బల్బుల వాడకం ద్వారా ఎంత కార్బన్‌డయాక్సైడ్‌ను గాల్లోకి రాకుండా అడ్డుకున్నారు, వాయుకాలుష్య నియంత్రణ ద్వారా ఎన్ని ప్రాణాలు కాపాడుతున్నారనే అనే అంశాల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ ఇస్తారు.
ఈ ప్రమాణాల ప్రకారం చూస్తే ఒడిశాలో కోటి మంది జనాభాలో 22.78 మంది చనిపోయారు. అలాగే విపత్తుల్ని ఎదుర్కొనే సామర్ద్యంల 50కి 22 పాయింట్లు దక్కాయి. సంప్రదాయేతర విద్యుత్ వాడకంలో 40కి 31 పాయింట్లు లభించాయి. ఎల్ఈడీ బల్బుల ద్వారా కార్బన్ డయాక్శైడ్ నిరోధించిన అంశంలో 103.22 పాయింట్ల లక్ష్యానికి ఏకంగా 120 పాయింట్లు లభించాయి. వాయుకాలుష్యం ద్వారా జీవితాలపై పడిన ప్రభావం అంశంలో 1442 పాయింట్ల లక్ష్యానికి ఏకంగా 3201 పాయింట్లు లభించాయి.
-
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications