వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బలపరీక్ష నెగ్గిన నితీష్ కుమార్-ఆర్జేడీ సర్కారు: మోడీ ప్రభుత్వంపై విమర్శలు

|
Google Oneindia TeluguNews

పాట్నా: నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం బుధవారం రాష్ట్ర శాసనసభలో విశ్వాస పరీక్షలో నెగ్గింది. బీజేపీ శాసనసభల తీవ్ర నిరసన మధ్య అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. మొత్తం 160 మంది ఎమ్మెల్యేలు విశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా, వ్యతిరేకంగా ఎవరూ ఓటు వేయలేదు. పాలక కూటమిలో భాగం కాని ఏఐఎంఐఎం ఏకైక ఎమ్మెల్యే అక్తరుల్ ఇమాన్ కూడా ఈ పరీక్షలో పాల్గొని విశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చారు. ఈ క్రమంలో నితీష్-ఆర్జేడీ ప్రభుత్వం బీహార్ రాష్ట్రంలో కొనసాగనుంది.

మరోవైపు, నితీష్ కుమార్ బీజేపీ, ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు.
తనకు ప్రధానమంత్రి కావాలనే ఆశయం లేదని, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తనను రాజకీయంగా అంతం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Nitish Kumar-led Bihar govt wins trust vote in Assembly; Bihar CM slams bjp and modi

సభలో తన సంఖ్యను నిరూపించుకుంటూ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడిన కుమార్ .. 2020లో బీజేపీ ఒత్తిడితో తాను ముఖ్యమంత్రి అయ్యానని, అయితే బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకున్నందున తమ ముఖ్యమంత్రిని చేయాలని తాను చెప్పానని అన్నారు. భవిష్యత్తులో తాను ఏదో ఒకటి కావాలని బీజేపీ చెబుతోందని కుమార్ అన్నారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో సమిష్టిగా పోరాడాలని అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు తాను విజ్ఞప్తి చేశానని అన్నారు.

బీజేపీ సమాజంలో సంఘర్షణను సృష్టిస్తోందని, హిందూ-ముస్లిం గొడవలకు కారణమవుతుందని, దానిని వారు ప్రయోజనం పొందుతున్నారని నితీష్ కుమార్ ఆరోపించారు. "వారు (బీజేపీ) సమాజంలో విఘాతం సృష్టించాలని మాత్రమే కోరుకుంటారు. 2013లో బీజేపీ నుంచి ఎందుకు విడిపోయామో అందరికీ తెలుసు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో అప్పటి ప్రధాని ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిల నుంచి నాకు ఎంతో గౌరవం లభించింది. వారు నాకు విలువ ఇచ్చారు. నా మాట విన్నారు, "అని నితీష్ కుమార్ 2013లో విడిపోవాలనే తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం కేవలం ప్రచారానికే పరిమితమైందని నితీష్ కుమార్ ఆరోపించారు. 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని బీజేపీ ప్రచారం చేసుకుంటోందని, అయితే స్వాతంత్య్ర పోరాటంలో బీజేపీ ఎక్కడ ఉందని ప్రశ్నించారు.

2017లో తాను కూటమి నుంచి వైదొలిగినప్పుడు బీజేపీ ఆరోపించిన ఏదీ రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) నేతలపై రుజువు కాలేదని కుమార్ అన్నారు . 2020లో తనపై బీజేపీ కుట్ర పన్నుతుందని తమ పార్టీ నేతలు హెచ్చరించారని, అయితే తాను వినలేదని కుమార్ చెప్పారు.

English summary
Nitish Kumar-led Bihar govt wins trust vote in Assembly; Bihar CM slams bjp and modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X