నితీష్ కుమార్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి, ఇద్దరు సిబ్బందికి గాయాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాన్వాయ్‌పై శుక్రవారం బీహార్‌లోని బక్సర్ జిల్లాలోని నందన్ ప్రాంతంలో రాళ్ల దాడి చేశారు. సమీక్ష యాత్రలో భాగంగా ఆయన బక్సర్ జిల్లాలో పర్యటిస్తున్నారు.

గుర్తు తెలియని వ్యక్తులు ఆ సమయంలో రాళ్ల దాడి చేశారు. ఆయన కాన్వాయ్‌లోని ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది గాయపడ్డారు. ఈ దాడి నుంచి నితీష్ సురక్షితంగా బయటపడ్డారు.

Nitish Kumar's convoy attacked in Bihar, Two security men injured

ఆ తర్వాత ఆయన నితీష్ తొలుత దమ్రోన్ గ్రామంలో బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో తన నిబద్దతపై గిట్టని వారు ఇలా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.

ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ప్రజలు తమ సహనం కోల్పోవద్దన్నారు. తనపై ఎవరు రాళ్ల దాడి చేశారో, ఎందుకు చేశారో ప్రస్తుతానికి తెలియదన్నారు. పాట్నాలో కూర్చొని పాలించేందుకు తాను లేనని చెప్పారు. మారుమూల గ్రామాల్లోను పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం తన కర్తవ్యం అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bihar Chief Minister Nitish Kumar's convoy was attacked in Buxar's Nandar during his "Vikas Samiksha Yatra". The attackers threw stones but the chief minister was rescued safely. Some of the security personnel in his convoy injured.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి