బీహార్ సిఎంగా దళిత నేత జితన్ రామ్ మంజి
పాట్నా: బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ స్థానంలో దళిత నేత జితన్ రామ్ మంజి ఎంపికయ్యారు. తనకు అత్యంత సన్నిహితుడైన మంజిని నితీష్ కుమార్ ఆ పదవికి ఎంపిక చేశారు. దీంతో బీహార్‌కు తొలి దళిత ముఖ్యమంత్రిగా మంజి నియమితులయ్యారు. లోకసభ ఎన్నికల్లో జెడియు ఓటమికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు.
గయ లోకసభ స్థానం నుంచి మంజి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. రాష్ట్రంలోని అత్యంత దళిత వర్గానికి చెందిన నేత మంజి. తన రాజీనామా సాధారమైంది కాదని, దానికి ధైర్యం కావాలని నితీష్ కుమార్ సోమవారం అన్నారు.

కారణం ఏదైనప్పటికీ ఎన్నికల ఫలితాలు తనకు అనుకూలంగా లేవని ఆయన అన్నారు. రాజీనామాను వెనక్కి తీసుకోవాలని జెడియు శాసనసభ్యులు ఆయనపై ఒత్తిడి చేశారు. అయినా అందుకు ఆయన సిద్ధపడలేదు. పార్టీ కోసం తాను రాష్ట్రమంతా పర్యటిస్తానని నితీష్ కుమార్ చెప్పారు.
ముఖ్యమంత్రిని ఎంపిక చేసే బాధ్యతను శాసనసభ్యులు నితీష్ కుమార్‌పై పెట్టారు. దీంతో ఆయన తనకు అత్యంత సన్నిహితుడైన మంజిని ఎంపిక చేశారు. ముఖ్యమంత్రిగా లేకపోయినా తాము నితీష్ కుమార్ మార్గదర్శకత్వంలో పనిచేస్తామని పార్టీ నాయకుడు వశిష్ట్ నారాయణ్ సింగ్ అన్నారు.












Click it and Unblock the Notifications