ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపిన సిఎం నితీష్

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన దాదాపు నెల రోజుల అనంతరం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. బీహార్ రాష్ట్రానికి రూ. 1.25 లక్షల కోట్ల విలువైన ప్యాకేజీని ప్రకటించినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు.

బీహార్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై మాట్లాడిన నితీశ్.. ‘బీహార్‌కు రూ. 1.25 లక్షల కోట్ల ప్యాకేజీ, అదనంగా రూ. 40 వేల కోట్లను ప్రస్తుత ప్రాజెక్టులకు ఇస్తామని మోడీ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం' అని తెలిపారు.

Nitish welcomes Modi's Bihar package of Rs 1.25lakh crore

‘ఈ నిధులను పారదర్శకంగా, అవినీతి రహితంగా ఖర్చు చేస్తాం. ప్రధాని ప్రకటించిన నిధుల వ్యయంపై ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు స్పీకర్ అధ్యక్షతన అఖిలపక్షాన్ని ఏర్పాటు చేస్తాం' అని నితీష్ కుమార్ అన్నారు. నితీశ్ నోటి వెంట మోడీ ప్రకటించిన ప్యాకేజీ మాటలు, ఆయనకు కృతజ్ఞతలు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

కాగా, మోడీ ఈ ప్యాకేజీ గురించి వివరించినప్పుడు, దాన్ని ఎన్నికల గిమ్మిక్‌గా నితీశ్ అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడిక కృతజ్ఞతలు చెప్పడం ద్వారా, ఎంత త్వరగా నిధులిస్తారని మోడీని ప్రశ్నించినట్టు అయిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+