చరిత్రను తిరగరాసిన నిజామాబాద్ లోక్ సభ
దేశ ఎన్నికల చరిత్రలోనే నిజమాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మరోసారి నిలిచింది. గతంలో అతి పెద్ద బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు కొనసాగిన నిజమాబాద్, తాజ ఎన్నికల్లో కూడ రికార్డ్ సాధించనుంది. ఎన్నికల కమీషన్ దేశంలోనే మొదటి సారిగా ఒక్క పోలింగ్ బూత్ లో 12 ఈవీఎంలను కేటాయించి వాటి ద్వార ,ఎక్కడా ఎలాంటీ సమస్యలు తలెత్తకుండా ఎన్నికలను నిర్వహించింది, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 1788 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి ,కాగా ప్రతి పోలింగ్ స్టేషన్ లో పన్నేండు ఈవీఎంలను ఏర్పాటు చేసింది .
దీంతో 21 వేలకు పైగా ఈవీఎంలను ఒక్క నిజామాబాద్ లోనే ఏర్పాటు చేసిన ఘనత ఎన్నికల కమిషన్ ను దక్కనుంది. కాగా పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర కు నిరసనగా 185 మంది అభ్యర్థులు పోటి చేసిన సంగతి తెలిసిందే.













Click it and Unblock the Notifications