నో బెయిల్.. ఓన్లీ జైల్: పీఎంసీ బ్యాంక్ స్కాంపై కస్టమర్ల భారీ నిరసన, కోర్టు ముందు వాహనాల ధ్వంసం
ముంబై: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్(పీఎంసీ) బ్యాంకులో జరిగిన కుంభకోణంపై ఆ బ్యాంకు కస్టమర్లు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనకు దిగారు. సదరు బ్యాంకులో కుంభకోణానికి బాధ్యులైనా అధికారులపై భారత రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని రోడ్లపైకి వచ్చారు.
బుధవారం భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. 'నో బెయిల్.. ఓన్లీ జైల్' అని నినాదాలు చేస్తూ ముంబై ఎస్ప్లనడే కోర్టు ముందు ఆందోళన నిర్వహించారు. అంతేగాక, కొందరు కస్టమర్లు ఆవేశంలో కోర్టు ముందు ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు.

బ్యాంకులో కుంభకోణం జరిగిన తర్వాత వినియోగదారులు తీసుకునే డబ్బుపై పరిమితిని విధించడంతో కస్టమర్లు తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారు. కుంభకోణానికి కారణమైన వారిపై శిక్షలు వేయకుండా.. తమ ఎంతో కష్టించి సంపాదించిన డబ్బును తీసుకోవడంపై ఆంక్షలు వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
కాగా, పీఎంసీ బ్యాంకు కుంభకోణంలో కీలక నిందితులైన హెచ్‌డీఐఎల్ డైరెక్టర్స్ సారంగ్ వాద్వాన్, రాకేష్ వాద్వాన్ లను పోలీసులు అక్టోబర్ 14 వరకు కస్టడీకి తీసుకున్నారు ముంబై పోలీసులు. పీఎంసీ బ్యాంక్ మాజీ ఛైర్మన్ వార్యమ్ సింగ్ ను కూడా పోలీసుల కస్డడీలోనే ఉన్నారు.
పీఎంసీ కుంభకోణంలో భారీగా ఆస్తులను సీజ్ చేసిన ఈడీ
పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్(పీఎంసీ) బ్యాంక్ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడును ప్రదర్శిస్తోంది. పీఎంసీ కుంభకోణంలో కీలకమైన హౌసింగ్ డెవలప్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (హెచ్‌డీఐఎల్) ఉన్నతాధికారులకు సంబంధించిన ఆస్తులపై దృష్టి సారించింది. గత వారం హౌసింగ్ డెవలప్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (హెచ్‌డీఐఎల్) కంపెనీకి చెందిన ఓ ప్రైవేట్ జెట్, పలు కార్లను ఈడీ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇవన్నీ సదరు కంపెనీ ప్రమోటర్లైన రాకేష్, సారంగ్ వాధ్వాన్‌లకు చెందినవి.
ఇక సోమవారం కూడా సోదాలు కొనసాగించింది ఈడీ. ఆలీభాగ్‌లోని 22 గదులు కలిగిన ఇల్లు, మరో విమానం, మాల్దీవుల్లో ఉన్న క్రీడలకు ఉపయోగించే ఓ బోటును ఈడీ గుర్తించింది. ఈ ఆస్తులను కూడా త్వరలోనే ఈడీ అటాచ్ చేయనుంది. మహారాష్ట్రలోని ఖరీదైన ప్రాంతాల్లో అనేక ఇళ్లను రాజకీయ నాయకులకు ఈ కంపెనీ కానుకలుగా అందజేసినట్లు ఈడీ గుర్తించింది. అయితే, రాజకీయ నాయకుల పేర్లను మాత్రం ఈడీ వెల్లడించలేదు.
ఇక ముంబై పోలీసు శాఖలో భాగమైన ఆర్థిక నేరాల విభాగం ఇప్పటికే పీఎంసీ స్కాంలో రూ. 4వేల కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంది. వీటిలో చరాస్తులు, సేవింగ్ అకౌంట్స్, విలువైన ఆభరణాలు ఉన్నాయి. కాగా, ఇప్పటికే హెచ్‌డీఐఎల్ డైరెక్టర్లు, ప్రమోటర్లు అయిన రాకేష్ వాద్వాన్, సారంగ్ వాద్వాన్‌లను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
గత దశాబ్ద కాలంలో బ్యాంకుకు రూ. 4,355.43కోట్ల మేర జరిగిన నష్టంలో పీఎంసీ బ్యాంక్, హెచ్‌డీఐఎల్ సీనియర్ అధికారులపై ఆర్థిక ఉల్లంఘనల పోలీసు విభాగం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్‌లో పీఎంసీ బ్యాంక్ ఎండీ జాయ్ థామన్, మాజీ ఛైర్మన్ వార్యమ్ సింగ్, ఇతర ఉన్నతాధికారుల పేర్లు కూడా ఉన్నాయి.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications