నవ్వుతూ జీతం తీసుకోవడం మంచి ఉద్యోగం: షోయబ్ అక్తర్

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: నేను ఇండియన్ మజాక్ లీగ్‌కు జడ్జిగా వ్యవహరిస్తున్నానని, ఆ కామెడీ షోను ఆస్వాదిస్తూనే మరోవైపు నా ఉద్యోగానికి డబ్బులు తీసుకుంటున్నానని, ఇంతకంటే మంచి ఉద్యోగం ఏమి ఉంటుందని పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ అక్తర్ అన్నాడు.

ఇంది తన దృష్టిలో అన్నింటి కంటే మంచి ఉద్యోగమని చెప్పాడు. తాను గతంలో పాకిస్తాన్‌కు ఆడిన సందర్భాలలో తమ డ్రెస్సింగ్ రూం వాతావరణం నవ్వులతో నిండిపోయేదని చెప్పాడు. ఆ సమయంలో ప్రతి క్రికెటర్ జోక్స్ వేయడంతో తనివితీరా నవ్వుకునే వాళ్లమన్నాడు.

No better job than being paid to enjoy jokes: Shoaib Akhtar

షోయబ్ అక్తర్.. క్రికెట్ అనంతరం వ్యాఖ్యాతగా సుపరిచయమే. అయితే, అతను త్వరలో రాబోతున్న ఓ భారతీయ టెలివిజన్ కామెడీ షోకు జడ్జిగా వ్యవహరించనున్నాడు. నవ్వులతో నిండిపోయే ఆ షోకు జడ్జిగా చేయడానికి సిద్ధం చేసిన అతను ఆనందం వ్యక్తం చేశాడు. అదో మధురమైన అనుభూతి అన్నాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former Pakistani cricketer Shoaib Akhtar says there cannot be a better job than being paid to enjoy jokes on a television show.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి