ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్ : దక్షిణాదిలో బీజేపీకి గడ్డుకాలమే.. ఏపీ, తెలంగాణలో ఖాతా తెరిచే ఛాన్సే లేదు
ఉత్తరాదిలో సత్తా చాటిన బీజేపీ దక్షిణాదిలో మాత్రం చతికిలపడినట్లు ఏబీపీ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్‌ను బట్టి తెలుస్తోంది. దక్షిణభారతంలో మొత్తం 128సీట్లు ఉండగా.. బీజేపీకి మాత్రం చేదు అనుభవమే మిగలనున్నట్లు సర్వే ఫలితాలు చెబుతున్నాయి. కర్నాటకలో మినహా ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుందని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఖాతాయే తెరవదని సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. దక్షిణాదిన బీజేపీ 27, కాంగ్రెస్ 53, ఇతరులు 48సీట్లు గెలుచుకుంటారని ఏబీపీ అంచనా వేసింది. కర్నాటకలో మాత్రం బీజేపీ పరిస్థితి కాస్త మెరుగుపడిందని, అక్కడ 28సీట్లలో బీజేపీ 15, కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు 13 స్థానాల్లో గెలుపొందుతాయని ఏబీపీ సర్వే స్పష్టం చేసింది.
20 స్థానాలున్న కేరళలో కాంగ్రెస్ 16, ఇతరులు 4 సీట్లు గెలుచుకుంటారని ఏబీపీ అంచనా వేసింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో , తెలంగాణలో బీజేపీ ఖాతా తెరిచే ప్రసక్తేలేదని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఏపీలో 25సీట్లలో వైఎస్ఆర్సీపీ 20 స్థానాల్లో విజయం సాధించనుండగా.. టీడీపీ 5 సీట్లు గెల్చుకోనుంది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ 17లో 16స్థానాల్లో విజయఢంకా మోగిస్తుందని ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్ తేల్చిచెప్పింది.

-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications