Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పదవులు అక్కర్లేదు.. అన్నాడీఎంకెలో బంధువర్గానికి 'నో ఛాన్స్': శశికళ

తనను సీఎంగా చూడాలని కొంతమంది భావించారని, అయితే ఎలాంటి పదవులు లేకుండానే ప్రజాసేవకు కట్టుబడి ఉండాలని శశికళ పార్టీ వర్గాలతో వెల్లడించారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

చెన్నై: అమ్మ మరణం తర్వాత అన్నాడీఎంకె రాజకీయాలు చిన్నమ్మ శశికళ చుట్టూ కేంద్రీకృతం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత సీఎంగా పన్నీర్ సెల్వం కొనసాగుతున్నప్పటికీ.. భవిష్యత్తుల్లో పగ్గాలు ఆమె చేతుల్లోకే వెళ్లే అవకాశాలున్నాయన్న వారు లేకపోలేదు. ఇందుకు తగ్గట్టుగా అన్నాడీఎంకె రాజకీయ పరిణమాలు కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

బంధుప్రీతికి దూరంగా శశికళ:

బంధుప్రీతికి దూరంగా శశికళ:

ఇలాంటి తరుణంలో శశికళ గురించి ఓ ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. పార్టీలో గానీ, ప్రభుత్వంలో గానీ బంధుప్రీతికి అసలేమాత్రం తావు ఇవ్వవద్దని శశికళ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.పోయెస్ గార్డెన్ లో తన బంధువలందరిని సమావేశపరిచి శశికళ ఇదే విషయం స్పష్టం చేశారట. అలాగే తన కుటుంబ సభ్యుల జోక్యాన్ని అసలు పట్టించుకోవద్దని మంత్రులకు, పార్టీలోని కీలక నేతలకు శశికళ సూచించినట్టుగా సమాచారం.

పార్టీ వర్గాల ఒత్తిడి ఉందా?:

పార్టీ వర్గాల ఒత్తిడి ఉందా?:

శశికళ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అన్నాడీఎంకె వర్గాల ఒత్తిడి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. బంధువులను పక్కనబెట్టాకే పార్టీ పగ్గాలు చేపట్టడం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని, లేనిపక్షంలో పార్టీలో కొంత విశ్వసనీయత దెబ్బతినే అవకాశముందని శశికళతో పార్టీ వర్గాలు అంతర్గతంగా చెప్పినట్టు తెలుస్తోంది.

గత చేదు అనుభవాల రీత్యా:

గత చేదు అనుభవాల రీత్యా:

అదీగాక, గతంలోను ఓసారి జయలలిత ఆగ్రహానికి గురై.. శశికళ బంధు వర్గమంతా పోయెస్ గార్డెన్ నుంచి బయటకెళ్లిపోవడం.. పార్టీ నుంచి కూడా శశికళను సస్పెండ్ చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా తనపై కుట్ర పన్నుతున్నారని అప్పట్లో దీనిపై జయ ఆరోపించారు.

అమ్మ మరణంతో.. శశికళ బంధువుల జోక్యం!

అమ్మ మరణంతో.. శశికళ బంధువుల జోక్యం!

ఆ తర్వాత నాలుగు నెలలకు శశికళను పార్టీలోకి తీసుకున్నప్పటికీ.. ఆమె బంధువర్గాన్ని మాత్రం జయలలిత పోయెస్ గార్డెన్ లోకి అడుగుపెట్టనివ్వలేదు. జయ మరణం తర్వాత ఇప్పుడు శశికళ బంధువర్గమంతా పోయెస్ గార్డెన్ లోనే మకాం వేయడంతో.. భవిష్యత్తులో ప్రభుత్వ, పార్టీ వర్గాల్లో వీరి జోక్యం ఉండవచ్చుననే వాదనలున్నాయి.

నెగెటివ్ సంకేతాలకు అవకాశం ఇవ్వకూడదని:

నెగెటివ్ సంకేతాలకు అవకాశం ఇవ్వకూడదని:

బంధువులు కూడా పార్టీలో చక్రం తిప్పడం మొదలుపెడితే.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉండడంతో.. అందుకు ఆస్కారం ఇవ్వవద్దనే ఉద్దేశ్యంతోనే శశికళ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తద్వారా పార్టీ వర్గాల్లోను తన పట్ల విశ్వసనీయత పెరుగుతుందనే భావన శశికళకు ఉండవచ్చు.

సీఎం పదవి అక్కర్లేదని చెప్పిందా?

సీఎం పదవి అక్కర్లేదని చెప్పిందా?

తనను సీఎంగా చూడాలని కొంతమంది భావించారని, అయితే ఎలాంటి పదవులు లేకుండానే ప్రజాసేవకు కట్టుబడి ఉండాలని శశికళ పార్టీ వర్గాలతో వెల్లడించారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ మాటకు శశికళ ఎంతమేర కట్టుబడి ఉంటారు? బంధుప్రీతిని ఎన్నాళ్లు నియంత్రించుకోగలుగుతారు? అన్న ప్రశ్నలపైనే ఆమె రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+