క్రిస్మస్ సెలవులను రద్దు చేసిన ఆ రాష్ట్ర ప్రభుత్వం: విద్యార్థులు తప్పనిసరి హాజరు

క్రిస్మస్ రోజున కూడా ఉత్తరప్రదేశ్ పాఠశాలలు తెరిచే ఉంటాయి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల హాజరును యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయం సాధారణ క్రిస్మస్ సెలవుకు విరుద్ధం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డిసెంబర్ 25 గురువారం నాడు పాఠశాలలు యధావిధిగా పనిచేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్ జారీ అయింది.

క్రిస్మస్ రోజు నాడే వాజ్‌పేయి జయంతి కూడా. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో కూడా శతజయంతి ఉత్సవాలను నిర్వహించనుంది ప్రభుత్వం. ప్రతి విద్యార్థి కూడా తప్పనిసరిగా ఈ శతజయంతి ఉత్సవాలు, ఈ సందర్భంగా నిర్వహించబోయే ప్రత్యేక కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలు శతాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని సూచించింది.

No Christmas Holiday in Uttar Pradesh Schools To Remain Open on 25 Dec for this reason

క్రిస్మస్, శీతాకాలం, కొత్త ఏడాది సందర్భంగా ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు సెలవులు ప్రకటించాయి. ఉత్తరప్రదేశ్ మాత్రం దీనికి భిన్నమైన నిర్ణయం తీసుకుంది. క్రిస్మస్ సెలవు కాకుండా వాజ్‌పేయి శతజయంతి కార్యక్రమాలను నిర్వహించనుంది. ఇందులో పాల్గొనడం ప్రతి విద్యార్థికీ తప్పనిసరి చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. గతంలో కూడా ఇక్కడ క్రిస్మస్ సెలవులు ఇచ్చింది.

ఏపీ, తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్‌, కేరళ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, ఒడిశా వంటి రాష్ట్రాల్లో సంవత్సరాంతపు సెలవులు ప్రకటించారు. పలు రాష్ట్రాల్లో జనవరి తొలి వారం వరకూ ఈ సెలవులు కొనసాగుతాయి. జమ్మూ కశ్మీర్‌లో తీవ్రమైన చలి, భారీ హిమపాతం కారణంగా పాఠశాలలు ఎక్కువ కాలం మూసివేస్తారు. ప్రీ-ప్రైమరీ నుండి డిసెంబర్ మొత్తం మూసి ఉంటాయి. ఉన్నత తరగతులు కూడా ఈ వారంలో మూతపడ్డాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+