రచయిత కాల్చివేత: సీఐడీ టూ సీబీఐ

బెంగళూరు: కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ రచయిత, హేతువాది, మాజీ ఉప కులపతి డాక్టర్ ఎం.ఎం. కలబుర్గి హత్య కేసులో ఇప్పటి వరకు ఎలాంటి ఆదారాలు చిక్కలేదని సీఐడీ అధికారులు అంటున్నారు.

హత్య జరిగి 100 రోజులు అయినా కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో కర్ణాటక ప్రభుత్వం విసిగిపోయింది. కేసు సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చిందని అధికార వర్గాలు అంటున్నాయి.

మూడు నెలల క్రితం డాక్టర్ ఎం.ఎం. కలబుర్గి ఇంటిలో ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు వెళ్లారు. ఆశీర్వాదం తీసుకోవాలని కుటుంబ సభ్యులకు చెప్పి లోపలికి వెళ్లి అతి సమీపం నుంచి కలబుర్గిని రివాల్వర్ తో కాల్చి హత్య చేసి బైక్ లో పరారైనారు.

No clue on and rationalist Dr MM Kalburgi killers

స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ణాటకతో సహ దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. కలబుర్గిని హత్య చేసిన వారిని అరెస్టు చెయ్యాలని పలు పార్టీల నాయకులు, రచయితలు, సంఘ, సంస్థలు డిమాండ్ చేశారు.

ప్రభుత్వం కేసు దర్యాప్తు సీఐడీకి అప్పగించింది. మూడు నెలల పూర్తి అయిన తరువాత సీఐడీ ఓ నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. డాక్టర్ కలబుర్గి, నరేంద్ర దాబోల్కర్, గోవింద్ పన్సారే హత్యలు ఒకే రకంగా ఉన్నాయని తెలిపారు.

అయితే కలబుర్గిని హత్య చేసిన వారు కర్ణాటకలో లేరని, ఈ ముగ్గురి హత్యల వెనుకు ఓ ముఠా ఉందని నివేదికలో వెల్లడించారు. అయితే ఆముఠా సభ్యుల వివరాలు, వారి ఆచూకి తెలుసుకోవడంలో సీఐడీ విఫలం కావడంతో కేసు సీబీఐకి అప్పగిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+