• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లాస్ట్ మినట్లో చంద్రబాబుకు కాంగ్రెస్ చేయి? మీరే బాధితులు.. గల్లాకు రాహుల్ గాంధీ

By Srinivas
|
  ఎంపీ గల్లా జయదేవ్ పై రాహుల్ వ్యాఖ్యలు

  న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానంపై లోకసభలో చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఓటింగును బహిష్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుదీర్ఘ చర్చలో కాంగ్రెస్ పాల్గొని, ఆ తర్వాత ఓటింగు సమయంలో సభ నుంచి వాకౌట్ చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఇది టీడీపీకి, సీఎం చంద్రబాబుకు ఊహించని షాక్. అవిశ్వాసం చర్చలో పాల్గొని, ఓటింగులో కాంగ్రెస్ పాల్గొనకుంటే బీజేపీకి మరింత ప్లస్ అవుతుంది.

  మోడీపై గల్లా తీవ్రవ్యాఖ్య, నిర్మల ఆగ్రహం: కాంగ్రెస్‌తో కలిసి.. దులిపేసిన ఎంపీ

  కాగా, రాహుల్ గాంధీ సుదీర్ఘ ప్రసంగం చేశారు. తన ప్రసంగంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పేరును ప్రస్తావించారు. రాహుల్ మాట్లాడుతుండగా మోడీ నవ్వారు. ప్రధాని నవ్వుతున్నప్పటికీ ఆయన మనసులో ఆందోళన కనిపిస్తోందన్నారు. ఏపీ ప్రజల ఆవేదన గల్లా ప్రసంగంలో కనిపించిందన్నారు. ఆయన ప్రసంగంలో నవ్యాంధ్ర ప్రజల బాధ తెలిసిందన్నారు. 21వ శతాబ్దం బాధిత రాష్ట్రం ఏపీ అన్నారు. తాను గల్లా ప్రసంగాన్ని జాగ్రత్తగా విన్నానని చెప్పారు. ఇదే విషయాన్ని రాహుల్.. టీడీపీ ఎంపీలను చూసి చెప్పారు. మీరు 21 శతాబ్ధం తొలి (ఏపీ) బాధితులన్నారు.

  No Confidence Motion Updates: You are the victim of a 21st-century political weapon, Rahul Gandhi tells TDP

  ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా కొడుకు జేషా పేరును ప్రస్తావించారు. మోడీ మిత్రుడు అంటూ అవినీతి ఆరోపణలు చేశారు. రాఫెల్ ప్రస్తావన తెచ్చారు. దీనికి ఎన్డీయే సభ్యులు అగస్టా అంటూ నినాదాలు చేశారు.

  ప్రతి ఒక్కరి అకౌంటులో 15 లక్షలు వేస్తామని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ చెప్పారని, కానీ ఏదీ జరగలేదని రాహుల్ అన్నారు. నోట్ల రద్దుతో గాయం చేశారన్నారు. గారడీ మాటలతో ఈ దేశ రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రధాని కాపలాదారు కాదని, పలాయనవాది అన్నారు. తన ప్రసంగం దేశం మొత్తం చూస్తోందని, ప్రధాని మాత్రం తన కళ్లలోకి చూడటం లేదన్నారు.

  ఈ సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడి పేరును, డొక్లాం ఇష్యూను రాహుల్ ప్రస్తావించారు. దీనిపై కేంద్రమంత్రి అనంత్ కుమార్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. స్పీకర్, సభ్యుల అనుమతి లేకుండా ఆరోపణలు నిబంధనలకు విరుద్దమన్నారు. ఆధారాలు చూపాలి లేదంటే సభలో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీలు కూడా అదే డిమాండ్ చేశారు.

  తనను పప్పు అన్నా తనకు కోపం రాదన్నారు. బీజేపీ, ప్రధాని, ఆరెస్సెస్ వల్లే తనకు కాంగ్రెస్ పార్టీ గొప్పతనం తేలిసిందన్నారు. శత్రువును కూడా ప్రేమించాలని వీళ్లను చూశాకే తెలిసిందన్నారు. తనపై మీ మనసులో కోపం, ద్వేషం ఉన్నాయన్నారు. మీ దృష్టిలో నేనొక పప్పునని, కానీ నాకు మాత్రం మీపై కోపం లేదన్నారు. ప్రేమే ఉందన్నారు.

  రాహుల్ ప్రసంగం ముగిసిన తర్వాత ప్రధాని మోడీ బాగా మాట్లాడారని ఏఐసీసీ అధ్యక్షుడిని అభినందించారు. రాహుల్ ప్రధాని మోడీ వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగనం చేసుకున్నారు.

  ఆ తర్వాత స్పీకర్ మాట్లాడుతూ.. ఎవరు ఎవరినీ అవమానించేలా మాట్లాడవద్దని సూచించారు. సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడవద్దన్నారు. అధికార విపక్షాలు ఒకరికొకరు సహకరించుకోవాలన్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Congress President Rahul Gandhi tells TDP during NoConfidenceMotion in Lok Sabha, 'You are the victim of a 21st century political weapon. I want to tell you that you are not the only one. The political weapon is called the 'jumla strike'
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more