'మా కుటుంబంలో ఎలాంటి విబేధాలు లేవు, వారిద్దరూ నా రెండు కళ్ళు '
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ప్రతీక్ తనకు రెండు కళ్ళ లాంటి వారని సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సతీమణి సాధనా గుప్తా తెలిపారు.
లక్నో:ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ప్రతీక్ తనకు రెండు కళ్ళ లాంటి వారని సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సతీమణి సాధనా గుప్తా తెలిపారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మూడో దశ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకొన్నారు.
సమాజ్ వాదీ పార్టీలో సాధన గుప్తా వల్లే సంక్షోభం నెలకొందనే ప్రచారం కూడ సాగింది. అయితే పార్టీలో నెలకొన్న సంక్షోభాలన్నీ సమసిపోయాయని ఆ కుటుంబసభ్యులు ప్రకటించారు.

పార్టీలో తన చిన్న కోడలు అపర్ణ యాదవ్ ను మరో అధికార కేంద్రం చేయాలని సాధనా గుప్తా చక్రం తిప్పారనే ప్రచారం కూడ పార్టీలో ఉంది.అయితే అఖిలేష్ వ్యూహాత్మకంగా వ్యవహరించి పార్టీని తన చేతుల్లోకి తీసుకొన్నారు.
అఖిలేష్, ప్రతీక్ ఇద్దరూ నాకు రెండు కళ్ళు
సమాజ్ వాదీ పార్టీలో సంక్షోభానికి కారణంగా ఆరోపణలు ఎదుర్కొన్న సాధనా గుప్తా మీడియాతో మాట్లాడారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ప్రతీక్ లు తనకు రెండు కళ్ళ లాంటి వారిని ఆమె చెప్పారు. అఖిలేష్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ తొలి భార్య సంతానం. ప్రతీక్ సాధనా గుప్తా కొడుకు. అయితే ప్రతీక్ రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తిని చూపలేదు. దీంతో ప్రతీక్ భార్య అపర్ణను రాజకీయాల్లోకి సాధనా గుప్తా ప్రోద్బలం వల్లే వచ్చిందని చెబుతుంటారు. ఆదివారం నాడు కుటుంబసభ్యులతో ఓటు వేసిన తర్వాత ఆమె మీడియాతో ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications