అమ్మ అనారోగ్యం : దీపావళి జరుపుకోబోమంటున్న అన్నాడీఎంకే నేతలు
చెన్నై : వారం రోజుల నుంచి అమ్మ ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులెటిన్ విడుదలవని నేపథ్యంలో.. అమ్మ అభిమానుల్లో ఆందోళన పెరిగిపోతోంది. ఇప్పటికే ఎవరికీ తోచిన రీతిలో వారు అమ్మ ఆరోగ్యం కోసం పూజలు, ప్రార్థనలు చేస్తుండగా.. ఈ ఏటా దీపావళి సెలబ్రేషన్స్ కు దూరంగా ఉండనున్నట్లు అన్నాడీఎంకే నేతలు ప్రకటించడం గమనార్హం.
మామూలుగా అయితే పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించే అన్నాడీఎంకే నేతలు.. అమ్మ అనారోగ్యం కారణంగా నేడు అత్యంత సాదాసీదాగా నిర్వహించారు. చెన్నై రోయపేటలోని అన్నాడీఎంకే హెడ్ క్వార్టర్స్ లో ఆ పార్టీ ప్రెసిడియమ్ చైర్మన్ మధుసూదనన్, మంత్రులు పన్నీరు సెల్వమ్, దిండిగల్ కె శ్రీనివాసన్, ఎడప్పడి కె పలనిస్వామి, సెల్లురు కె రాజ్ సమక్షంలో నిరాడంబరంగా పార్టీ వేడుకను నిర్వహించారు.

అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్ విగ్రహానికి పూలదండలు వేసిన అనంతరం పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. టపాసులు పేల్చడం, స్వీట్లు పంపిణీ చేయడం లాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు నేతుల. అమ్మ అనారోగ్యం కారణంగా.. వచ్చే దీపావళిని కూడా నిర్వహించుకోబోమని స్పష్టం చేశారు అన్నాడీఎంకే నేతలు.












Click it and Unblock the Notifications