వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశ విభజన సమయంలో ఇక్కడే ఉండిపోయిన ముస్లింలతో మేలు కలగలేదు: యోగీ

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఈ మధ్యకాలంలో యోగీ వార్తల్లో నిలిచారు. తాజాగా ఓ విదేశీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగీ ఆదిత్యనాథ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో యోగీ ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు మళ్లీ అగ్గిరాజేసేలా కనిపిస్తున్నాయి.

తాజాగా ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశ విభజన సమయంలో ముస్లింలు పాకిస్తాన్‌కు వెళ్లకుండా ఇక్కడే ఉండటం వల్ల దేశానికి ఎలాంటి మేలు జరగలేదన్నారు. దేశ విభజనను ముస్లిం సామాజిక వర్గం వారు వ్యతిరేకించి ఉండి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో యోగీ వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యాయి. ఇప్పటికే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు యోగీ ఆదిత్యానాథ్.

No favours done by Muslims by staying back in India during Partition:Yogi stokes controversy

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో యోగీ ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఢిల్లీలోని అధికారిక ఆప్ పార్టీ యోగీ ఆదిత్యనాథ్‌ను ప్రచారం నుంచి నిషేధం విధించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేసింది. మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ రెండ వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం యోగీ చేస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేసింది. అంతకుముందు ఓ సభలో మాట్లాడిన యోగీ ఆదిత్యనాథ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉగ్రవాది అని పేర్కొన్నారు. అంతేకాదు షాహీన్‌బాగ్‌లో జరుగుతున్న నిరసనల వెనక ఉంది ఆమ్‌ ఆద్మీ పార్టీ అని ఆరోపణలు చేశారు.

ఇక మరో సందర్భంలో భారత పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న వారంతా పాకిస్తాన్‌కు మద్దతు పలుకుతున్నట్లే లెక్క అంటూ వ్యాఖ్యానించారు యోగీ ఆదిత్యనాథ్. నిరసనల్లో పాల్గొంటున్న నిరసనకారులంతా పాకిస్తాన్‌కు చెందినవారే అని చెప్పి కాంట్రవర్శీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు.

English summary
Uttar Pradesh chief minister Yogi Adityanath, who has been in the center of controversy for his communally divisive statements, has another one to add to his account. He said that Muslims who chose to stay in India when it was partitioned did the country "no favours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X